ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల (Fee Reimbursement) విడుదలతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ (Telangana)లోని ప్రైవేటు వృతి విద్యా కళాశాలలు (Colleges) బంద్ ప్రకటించాయి. కాలేజీల యాజమాన్యాలతో రాష్ర్టప్రభుత్వం (State Government) ఆదివారం చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాకపోవడంతో సోమవారం కాలేజీలను మూసివేశారు. సోమవారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు ప్రొఫెషనల్ కాలేజీల (Professional Colleges) ప్రతినిధులతో మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయంపై
నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కాలేజీలు మూసివేసినట్లు కాలేజీల యాజమాన్యం స్పష్టం చేసింది. వారి డిమాండ్లు నెరవేర్చేవరకు ఇంజినీరింగ్ (Engineering), ఫార్మా, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు బంద్ పాటిస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందించారు. ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామని, ఇవాళ (సోమవారం) ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ విజ్ఞప్తికి కళాశాలల సమాఖ్య సానుకూలంగా స్పందించిందన్నారు.
డిమాండ్లు ఇవే..
ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ.1200 కోట్ల పెండింగ్ బిల్లులను దసరాలోపు చెల్లించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. నాలుగేళ్ల బకాయిలు ఈ ఏడాది డిసెంబరు 31లోపు చెల్లించాలని కోరుతున్నాయి. అలాగే బోధనా రుసుములను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటుపై ఫీజిబిలిటీ నివేదికను అక్టోబరు 31లోపు విడుదల చేయాలంటున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీవోను, ఫీజ రీయింబర్స్‌మెంట్‌ను డిసెంబరు 31లోపు విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

