అక్కడికక్కడే ఏడుగురు హరీ

  • ట్రిప్పర్ కిందకు దూసుకెళ్లిన కారు
  • మృతులందరూ ఒకే కుటుంబం
  • నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం

( ఆంధ్రప్రభ, నెల్లూరు ప్రతినిధి): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ కిందటకు కారు దూసుకు పోయింది. కారు నుజ్జునుజ్జు అయింది. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో అంతమంది మృతి చెందడంతో ఆ ప్రాంతం భీబత్సంగా తయారయ్యింది. బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Leave a Reply