కరెంటు కోతలపై రైతులు రాస్తారోకో..

సిద్దిపేట బ్యూరో, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని తడకపల్లి విద్యుత్ సబ్‌స్టేష‌న్ ఎదుట శనివారం రైతులు రాస్తారోకో ఆందోళనకు దిగారు.

కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం కలిగింది.