రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి…

  • యాదాద్రి జిల్లా మార్కెటింగ్ అధికారిణి సబిత

మోత్కూర్, ఆంధ్రప్రభ: రైతులు నాణ్యమైన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తేనే ప్రభుత్వ మద్దతు ధరలు పూర్తిగా లభిస్తాయని యాదాద్రి జిల్లా మార్కెటింగ్ అధికారిణి సబిత సూచించారు. శుక్రవారం అనాజీపురం ప్రాంతంలోని మహాలక్ష్మి పత్తి మిల్, దత్తప్పగూడెంలోని నటరాజ్ పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారిణి సబిత మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులు పత్తిని ఆరబెట్టి కేంద్రాలకు తెచ్చుకోవాలన్నారు. తేమ శాతం నిబంధనలు ఖచ్చితంగా అమల్లో ఉన్నందున.. తేమ ఎక్కువగా ఉంటే మద్దతు ధర విషయంలో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. రైతులు తప్పనిసరిగా ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని, సంబంధిత మిల్లులకే పత్తిని తరలించాలని సూచించారు. పరిశీలనలో సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ కార్యదర్శి జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Leave a Reply