రైతుల మెరుపు నిరసన

సూర్యాపేట, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని… అరకొరగా కొనుగోలు చేసిన ధాన్యంలో 40కేజీల బస్తాకు రెండు కేజీల చొప్పున కటింగ్ చేస్తున్నారని నిరసిస్తూ అడివెంల స్టేజి దగ్గర అడివెంల, కుంచమర్తి రైతులు (Kunchamarthi farmers) మెరుపు నిరసనకు దిగారు. వడ్ల ట్రాక్టర్ అడ్డుగా పెట్టి రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రైతుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని శాంతింపజేసి రైతులను రోడ్డు నుండి కొనుగోలు కేంద్రానికి పోలీసుల (police) తీసుకెళ్లి ట్రాఫిక్ ను క్రమబద్దికరించారు.

Leave a Reply