మొవ్వ : ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) పామర్రు నియోజకవర్గం(Pamarru Constituency) మొవ్వ మండలం మొవ్వ పాలెం గ్రామంలో కో-పరేటివ్ బ్యాంకు(Co-operative Bank) దగ్గర బుధవారం ఉదయం 6:30 గంటలకు యూరియా కోసం రైతులు వచ్చారు. ఒకరికొకరు తోపులాట చేసుకోకుండా క్రమ పద్ధతిలో ఉండేందుకు చెప్పులను క్యూలైన్ లో పెట్టి రైతులు చెట్టు నీడకు చేరుకున్నారు. వేములవాడ, మొవ్వపాలెం గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో యూరియా కోసం రావడం జరిగింది. చెప్పులు క్యూ లైన్ లో పెట్టడం సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉదయాన్నే రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్న దుస్థితి కనిపిస్తూనే ఉంది. అధికారులు రైతులకు టోకెన్లు అందజేసినప్పటికీ ఎండలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Department officials) అందరూ యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ రైతులు పడుతున్న ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు.

Leave a Reply