నగరంలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టైంది. ఈరోజు (గురువారం), ఎల్బీ నగర్ పోలీసులు నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే అందులో అహ్మదాబాద్‌కు చెందిన ఒక మరోవ్యక్తి పరారీలో ఉన్నాడు.
కాగా, పట్టుబడ్డ నిందితుల నుండి రూ.11.50 లక్షల నకిలీ కరెన్సీ, రూ.4 లక్షల అసలు కరెన్సీ, 10 నకిలీ బంగారు బిస్కెట్లు, 7 మొబైల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.