- వెంటనే స్పందించి తొలగించిన మక్తల్ పోలీసులు
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణం నల్లజానమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి 167 పై ఏర్పాటు చేసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి జాతర ఆహ్వాన తోరణం ఆదివారం రాత్రి అకస్మాత్తుగా రోడ్డుపై కూలిపోయింది. ఈ ఘటనపై మక్తల్ పోలీసు అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
సీఐ రామ్‌లాల్, ఎస్ఐ వై. భాగ్యలక్ష్మి రెడ్డి, మక్తల్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, జెసిపి సహాయంతో తోరణాన్ని తొలగించి రహదారి మార్గాన్ని పూర్తిగా క్లియర్ చేశారు.
ఈ సందర్భంగా సీఐ రామ్‌లాల్ మాట్లాడుతూ… ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజల భద్రత మా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. సమయోచితంగా స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించిన మక్తల్ పోలీసుల పనితీరును స్థానికులు అభినందించారు.

