నిజామాబాద్ వెలమ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నిజామాబాద్ వెలమ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన కార్యవర్గం విజయం సాధించింది. అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా శ్రీ బల్గూరి రాజేశ్వర్ రావు (న్యాల్కల్), ప్రధాన కార్యదర్శిగా శ్రీ బీరెల్లి విజయరావు (మెట్పల్లి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీ పడకంటి పోతన్ రావు (బాద్గుణ), శ్రీ వొక్కెర్ల నర్సింగ్ రావు (నారాయణపూర్), శ్రీమతి కిష్టగారి సమత మంజిత్ రావు (మాదాపూర్) ఎంపికయ్యారు.
కోశాధికారిగా శ్రీ మార్నేని పాపేశ్వర్ రావు (నిజాంపూర్) ఎన్నిక కాగా, సంయుక్త కార్యదర్శులుగా శ్రీ భూపాల్ శ్రీనివాసరావు (నిజామాబాద్), శ్రీ గంటన్నగారి బాలకిషన్ రావు (మాధాపూర్), శ్రీమతి న్యాల్కల్ లత రాజేశ్వర్ రావు (వల్లభాపూర్) ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులు, డైరెక్టర్లుగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఎన్నికయ్యారు. డైరెక్టర్ నెం.1గా శ్రీ కోస్లి కిషన్ రావు (నందిగాం), నెం.2గా శ్రీ మిరియాల రవికుమార్ రావు (మద్దేపల్లి), నెం.3గా శ్రీ న్యాలకంటి శ్రీనివాసరావు (పోతంగల్), నెం.4గా శ్రీమతి బీర్కూర్ ఉమాదేవి (తుంగిని) ఎన్నికయ్యారు.
అలాగే డైరెక్టర్ నెం.5గా శ్రీ పాపయ్యోల్ల లింగారావు (నిజాంపూర్), నెం.6గా శ్రీ వొక్కెర్ల ప్రవీణ్ రావు (నారాయణపూర్–1), నెం.8గా శ్రీ బట్టు హరీశ్ రావు (జన్నపల్లి–2), నెం.9గా శ్రీ కే. రాజేశ్వర్ రావు (మాధాపూర్–1), నెం.10గా శ్రీ మాక్లూర్ రామారావు (మాధాపూర్–2) ఎన్నికయ్యారు.
డైరెక్టర్ నెం.11గా శ్రీమతి బొంతల వనిత, నెం.12గా శ్రీమతి సిర్నాపల్లి స్వరూప రాణి, నెం.13గా శ్రీ వై. వెంకట సంజీవరావు, నెం.15గా శ్రీ కే. వెంకటేశ్వర్ రావు, నెం.16గా శ్రీ ఎస్. కరుణాకర్ రావు, నెం.19గా శ్రీ మాక్లూర్ రమణారావు, నెం.20గా శ్రీ సతీష్ రావు, నెం.21గా శ్రీమతి కంటెగారి అశ్విని, నెం.22గా శ్రీ తన్నీరు కృష్ణారావు, నెం.24గా శ్రీమతి నర్సూరి శిరీషా, నెం.25గా శ్రీ కే. పవన్ కుమార్ ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ సభ్యులు, వెలమ సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
