Exclusive | బోర్డ‌ర్ల‌లో ముత్తాత‌! రంగంలోకి దిగ‌నున్న‌ ఎస్‌-500

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ – ఇండియా గగనతల రక్షణ వ్యవస్థకు.. ఎస్-400 సిస్టమ్ కీలకంగా మారింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు సహా అనేక గగనతల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పుడు.. అంతకుమించిన కెపాసిటీ గల ఎస్-500 మిసైల్ విధ్వంసక వ్యవస్థను కూడా అందించేందుకు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌లో వీటిని తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించింది. ఇప్పుడు.. వరల్డ్ వైడ్ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో.. ఎస్500 రక్షణ వ్యవస్థ.. ఎస్400 కంటే ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోంది? అది ఎలా పనిచేస్తుందన్న చర్చ కూడా మొదలైంది. ఎస్500 ప్రోమిథియస్.. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్. ఇది.. భూమి మీద నుంచి గాల్లోని మిసైళ్లను పక్కాగా కూల్చేస్తుంది.

హైప‌ర్‌సోనిక్ మిస్సైల్ వ‌చ్చినా ఖ‌త‌మే..

ఎస్400 ప్రధానంగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు, స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని టార్గెట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బాలిస్టిక్ మిసైళ్లని కూడా 60 కిలోమీటర్ల దూరంలో అడ్డుకోగలదు. ఇక.. ఎస్500.. ఎస్400కి కంప్లీట్ వెర్షన్‌గా తయారుచేశారు. ఇది.. ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లతో పాటు హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, తక్కువ ఎత్తులో ఉన్న శాటిలైట్లు, స్పేస్ ఆయుధాలను కూడా టార్గెట్ చేయగలదు. బాలిస్టిక్, హైపర్‌సోనిక్ మిసైళ్లను కూల్చడంలో కీలకంగా ఉంది. ఎస్400 రేంజ్.. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చగలుగుతుంది. అదే.. ఎస్500.. 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సులువుగా ఛేదిస్తుంది. బాలిస్టిక్ మిసళ్లైని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే పసిగడుతుంది. ఎస్400 కంటే ఎక్కువ దూరంలో ఉన్న టార్గెట్లను గుర్తించి కూల్చేయగలదు. ఎస్400.. 30 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న టార్గెట్లను ఎదుర్కోగలదు. ఎస్500 ఆల్టిట్యూడ్‌ రేంజ్ అంతకుమించి ఉంది. 180 నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోనూ.. శత్రు దేశాల అస్త్రాలను అడ్డుకొని కూల్చేయగలదు.

ఎస్-500 యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్

ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెస్పాన్స్ టైమ్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎస్400 సిస్టమ్ టార్గెట్లని గుర్తించి.. 10 సెకన్లలోనే యాక్షన్ మొదలుపెడుంది. అదే.. ఎస్500 అయితే.. కేవలం 4 సెకన్లలోనే రెస్పాండ్ అవుతుంది. వేగవంతమైన టార్గెట్లను ఎదుర్కోవడంలో కీలకంగా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని మరింత శత్రుదుర్భేద్యంగా మారుస్తుంది. ఎస్400 సిస్టమ్‌లో ఉన్న మల్టీ ఫంక్షన్ రాడార్.. 36టార్గెట్లని ఒకేసారి ట్రాక్ చేయగలదు. అదే.. ఎస్500 అయితే 80 నుంచి వంద టార్గెట్లను.. ఒకేసారి ట్రాక్ చేయగలదు. ఇందులో ఉన్న అడ్వాన్స్‌డ్ మల్టీ ఫంక్షన్ రాడార్‌.. స్టెల్త్ టెక్నాలజీ సహా తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ టార్గెట్లను గుర్తించడంలో మెరుగైన కెపాసిటీ కలిగి ఉంది.

అంతరిక్షంలోని టార్గెట్లను ధ్వంసం చేయగల స‌త్తా..

ఎస్-500తో ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్‌గా తయారవుతుంది. దీనిని.. ఎస్-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఇది.. శత్రుదేశాల అస్త్రాలనే కాదు.. అంతరిక్షంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగలదు. భూమి పైనుంచి దూసుకొచ్చే దాదాపు అన్ని రకాల టార్గెట్లను నాశనం చేయగలికే కెపాసిటీ దీని సొంతం. ఫైటర్‌జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్‌సోనిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్స్‌ని సైతం కూల్చగలదు. దీని చుట్టూ 600 కిలోమీటర్ల పరిధిలో.. శత్రుదేశం యుద్ధవిమానాల నుంచి అత్యంత అధునాతన మిసైళ్ల దాకా.. ఏవీ కూడా దీని ధాటికి తట్టుకోలేవు. గంటకు దాదాపుగా 25 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే టార్గెట్లని కూడా ఏకకాలంలో ధ్వంసం చేయగల సత్తా దీనికి ఉంది. ఎస్-500ను అల్మాజ్ ఆంటే అనే సంస్థ డిజైన్ చేసింది. 2021లో దీన్ని రష్యా అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టారు.

రష్యాతో 5 స్క్వాడ్రన్ల ఎస్-400ల కొనుగోలుకు ఒప్పందం

ఇప్పటికే.. ఇండియా దగ్గర ఎస్-400 సిస్టమ్ ఉంది. 2018లో రష్యాతో 5 స్క్వాడ్రన్ల ఎస్-400ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లు భారత్‌కు చేరాయి. మరో 2 స్క్వాడ్రన్లు.. ఇంకొన్ని నెలల్లో భారత్ చేరుకోనున్నాయి. వీటికి ఎస్-500 ఎయిర్ డిఫెన్స్ కూడా తోడైతే.. ఇక శత్రు దేశాలకు సీన్ సితారైపోతుంది. భారత్ వీటిని సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు తీర ప్రాంతాలైన ముంబై, చెన్నై, వైజాగ్‌ నగరాలకు రక్షణగా మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా.. వీటి మోహరింపు ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న హైపర్‌సోనిక్, స్పేస్ ఆధారిత బెదిరింపులు

Leave a Reply