గుడుంబా కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం

వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.16.43 లక్షల ఆదాయం

తొర్రూరు, ఆంధ్రప్రభ : ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో వాహనాల వేలం నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి పి. కరంచంద్ పర్యవేక్షణలో 47 వాహనాలకు వేలం నిర్వహించగా, 50 మంది పాల్గొన్నారు. వీరిలో పలువురు 39 వాహనాలను దక్కించుకున్నారు. ఈ వాహనాలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.12.41 లక్షలు కాగా, వేలం ద్వారా అదనంగా రూ.1.51 లక్షలు లభించాయి. దీంతో 39 వాహనాల విక్రయ ధర రూ.13.92 లక్షలకు చేరింది. దీనికి జీఎస్టీ రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.16.43 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శంకర్, గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.