పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నేటి నుండి ప్రారంభమై పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు విద్యాశాఖ అధికారి డి.స్వామి తెలిపారు.భీమ్‌గల్ మండలంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి డి. స్వామి మీడియా ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ,భీమ్‌గల్ మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసాం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల, ముచ్కూర్,పల్లికొండ ప్రభుత్వ పాఠశాల కేంద్రాల్లో మొత్తం 704 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
పరీక్ష కేంద్రాల వద్ద సమయానికి ముందు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని, పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
