ప్రతి ఒక్కరూ ధర్మ మార్గాన్ని ఆచరించాలి
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి
కడెం, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరు ధర్మమార్గాన్ని ఆచరించి భగవంతుడి సేవలో తరించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి శ్రీవల్లి పుత్తూరు 23వ పీఠం ఉత్తరాధికారి శఠగోపం రామానుజ జీయర్ స్వామి అన్నారు.
ఆదివారం కడెం మండలంలోని దిల్దార్ నగర్ సారంగాపూర్ ఎలగడప సమీపంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన అక్కకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ప్రముఖ వైష్ణవ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామి విచ్చేశారు. క్షేత్రానికి చేరుకున్నస్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు, గ్రామ ప్రముఖులు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం కొండపై స్వయంభూగా వెలసిన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో లోకకల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు వోద్దిపర్తి వెంకటరమణచార్యులు, వంశీ కృష్ణ చార్యులు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు జగ్గారావు ఆలయ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మణ్, ఎలగడప గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేష్, ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు, లక్ష్మీరాజం మార్కపు లక్ష్మణ్, రవి, నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు ,భక్తులు పాల్గొన్నారు.
