- వెలికి తీస్తేనే గుర్తింపు లభిస్తుంది..
- 57 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం..
రామగిరి, మే 20 (ఆంధ్రప్రభ): ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత దాగి ఉంటుందని.. దానిని వెలికితీయడం ద్వారా గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈసందర్భంగా సింగరేణి సంస్థ ఆర్జీ- 3 జీఎం నరేందర్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ప్రస్తుతం ఇప్పటివరకు 57 వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, ఇంకా 20 నుంచి 25 వేల మంది నిరుద్యోగులు విుగులున్నారన్నారు.
అయితే అదే లక్ష్యంతో వారికి కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందస్తుగా స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడే ఉద్యోగ అవకాశం మెరుగవుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ – ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు-చేయడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, దానిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎంతోమంది నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో-టైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే యంగ్ ఇండియా ఆధ్వర్యంలో-టైనింగ్ ఇప్పించి 600 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ మంతిని ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలోని యువతను గుర్తించి వారిలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారం నుండి గ్రామాల్లో సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్, ఆర్జీ- 1 జీఎం లలిత్ కుమార్, ఏఎల్‌పీ జీఎం నాగేశ్వరరావులు పాల్గొన్నారు.