Epic |ఆకట్టుకుంటున్న మధురమైన మెలోడీ

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఆనంద్‌ దేవరకొండ, వైష్టవి చైతన్య హీరోహీరోయిన్లుగా 90స్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ దర్శకుడు ఆదిత్య హసన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ చిత్రం నుంచి మూడో సింగిల్‌ నేడు విడుదలైంది. ప్రేమలోని భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందించిన ‘మనసావాచా’ పాట ఆకట్టుకుంటుంది.

ఈ పాటకు ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర, గాయకుడు చరణ్ పాడారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించారు. ఆప్పటికే విడుదలైన సంచారమే, ప్రియసఖి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బేబీ తరువాత ఆనంద్‌ దేవరకొండ, వైష్టవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుసగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.