కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు..

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో
ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్యదర్శి కన్నబాబు, కమిషనర్‌ రామచంద్ర మోహన్‌

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మను దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ సోమవారం దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న కమిషనర్‌కు ఆలయ ఈవో వి.కె.శీనా నాయక్‌, ప్రధానార్చకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉన్నతాధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను ఈఓ అందజేశారు.