కూటమి అభ్యర్థులను గెలిపించండి

  • టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి శివ నాగరాజు
  • పాలకోడేరు మండలంలో జోరుగా శివ నాగరాజు ఎన్నికల ప్రచారం

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పాలకోడేరు మండలం జడ్పీటీసీ అభ్యర్థి చింతలపాటి శివ నాగరాజు కోరారు. పాలకోడేరు మండలంలో శివ నాగరాజు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా హోరెత్తిస్తున్నారు. మండలంలోని గరగపర్రు లో శనివారం తన ఎన్నికల ప్రచారాన్ని గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి ఉప్పలపాటి సూర్య కుమారి తో నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ తమ విలువైన ఓటును తనకు సైకిల్ గుర్తుపై, ఎంపీటీసీ అభ్యర్థికి గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. తనపై ఎంతో నమ్మకంతో జడ్పీటీసీ గా అవకాశం కల్పించిన ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజుకి, ఆయన కుమారుడు భరత్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకోడేరు సహకార సంఘం మాజీ చైర్మన్ ఇందుకూరి బలరామరాజు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు సిరిగినీడి శ్రీనివాస్, గాదిరాజు శ్రీహరి రాజు, గాదిరాజు రామరాజు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.