మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి (Medipally) పోలీసు స్టేషన్ పరిధిలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. సీనియర్లతో జరిగిన వాగ్వాదం కారణంగా మనస్తాపానికి గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉట్నూరుకు చెందిన జాదవ్ సాయితేజ (19) నారపల్లిలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం (BTechStudent) చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కళాశాలలోని సీనియర్ విద్యార్థులతో గొడవ జరిగింది. ఆ విషయం పై తీవ్ర ఆవేదనకు లోనైన సాయితేజ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply