ENERepeat |‘ఈ నగరానికి ఏమైంది 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE 2) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను నవంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీని వెల్లడిస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, మాగంటి శ్రీనాథ్, వెంకటేశ్ కాకుమాను కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. మొదటి భాగం యువతను ఆకట్టుకోవడంతో సీక్వెల్‌పై కూడా అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
