ENE2 Releas Date| ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈnఈ 2’ చిత్రానికి సినిమా యూనిట్ అప్‌డేట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది. “దట్స్ ఎ ర్యాప్ ఆన్ వన్ సైడ్… సీ యూ ఆన్ ది అదర్ సైడ్ ఆన్ నవంబర్ 19” అంటూ చిత్రబృందం చేసిన ప్రకటన సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. నవంబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాలు యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఈnఈ 2’ పై అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, మాగంటి శ్రీనాథ్, వెంకటేశ్ కాకుమాను, అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో తరుణ్ భాస్కర్ సినిమాల్లో కనిపించిన సహజమైన పాత్రలు, స్నేహం, ప్రేమ, యువత జీవితాన్ని ప్రతిబింబించే కథన శైలి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, అజ్ ఆరోన్ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవి తేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో చిత్రబృందం ఉత్సాహం కనిపించింది.
