సిద్ధాంతాల ఆవల

అనంతమైన సత్యం

“ రాజకీయ రంగులు ఎన్ని మారినా, సిద్ధాంతా లు ఎన్ని పుట్టుకొచ్చినా.. ఈ దేశపు మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ నరనరాల్లో ప్రవహించే సంస్కృతే హిందుత్వం. అది విభ జించేది కాదు, అందరినీ కలిపి ఉంచేఒక జీవన సూత్రం. ” . దశాబ్దాల పాటు దేవుడు ఒక మత్తుమందు అన్న మా ర్క్సిస్ట్ సూత్రాన్ని వల్లెవేస్తూ నాస్తికత్వాన్ని నూరిపోసిన కమ్యూనిస్ట్ దిగ్గజం నారాయణ తిరుమల శ్రీవారి చెంత మోకరిల్లడమే దీనికి సాక్ష్యం. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి పర్యటన మాత్రమే కాదు, కరుడుగట్టిన భౌతి కవాద సిద్ధాంతం అనంతమైన దైవశక్తి ముందు లొంగి పోయిన సందర్భం.


కమ్యూనిస్టులు తమ కేడర్కు దేవుడు లేడని అంతా ప్రకృతి, శ్రమ శక్తి అని బోధిస్తారు. కానీ వయసు పెరిగేకొద్దీ శారీరక శక్తి క్షీణించే కొద్దీ భౌతికవాదం ఇచ్చే భరోసా కంటే కంటికి కనిపించని ఆ మహాశక్తి ఇచ్చే ధైర్యం మిన్న అని వారు గ్రహిస్తున్నారు. ఎర్రజెండా నీడలో ఎన్ని పోరాటాలు చేసినా ఆఖరి మజిలీలో మనసు కోరుకునేది ప్రశాంతతనే. మార్క్సిస్ట్ గ్రంథాలు మేధస్సుకు పదును పెడతాయేమో కానీ ఆత్మకు శాంతిని ఇవ్వలేవని గతంలో గద్దర్, శ్రీశ్రీ వంటి మేధావుల పరిణామ క్రమం స్పష్టం చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానశాస్త్రం ఎంత ఎదిగినా ఇస్కాన్ వంటి సంస్థల ద్వారా పాశ్చాత్య మేధావులు భారతీయ ఆధ్యాత్మికతను హక్కున చేర్చుకుంటున్నారు.

మన దేశం లోని కొందరు మేధావులు ఇంకా మతకోణంలో ఆధ్యాత్మి కతను విమర్శించడం విచారకరం. సిద్ధాంతాలు కాలానికి అనుగుణంగా మారవచ్చు లేదా కనుమరుగు కావచ్చు కానీ సనాతన ధర్మం అందించే ఆధ్యాత్మిక సత్యం శాశ్వతం. నాస్తికత్వం కేవలం యవ్వనపు ఆవేశమని ఆధ్యాత్మికత అనుభవం నేర్పే పాఠమని ఈ పరిణామం చెబుతోంది.
మానవ మేధస్సు తన ప్రస్థానంలో ఎన్నో

మిగతా వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply