Endhayya Saami song | ‘రణబాలి’ నుంచి ఏందయ్య సామీ పుల్‌ సాంగ్‌ రిలీజ్‌

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రణబాలి’. ఈ సినిమాకు సంబంధించ మొదటి లిరికల్‌ సాంగ్‌ ‘ఏందయ్య సామీని నేడు విడుదల చేశారు. గతంలో రష్మిక, విజయ్‌ పెళ్లి సందర్బంగా ఈ పాట గ్లింప్స్‌ తో టీమ్‌ వారికి విష్‌ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఈ పాట పూర్తి సాంగ్‌ ను విడుదల చేశారు.

“రణబాలి, జయమ్మల అందమైన ప్రపంచంతో ప్రేమలో పడదాం రండి” అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను షేర్ చేశారు. ఈ పాటకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ గీతాన్ని విడుదల చేశారు. అగ్నిపథ్, తానాజీ, ఆధిపురుష్‌ , సైరత్‌ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అజయ్ గోగావలే, శ్వేత మోహన్ ఈ పాటను పాడగా.. రామజోగయ్య శాస్ర్తి లిరిక్స్‌ అందించారు. విడుదలైన కొద్దిసేపట్లోనే అన్ని భాషల్లోనూ ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

కాగా ఈ సినిమాకు రాహూల్‌ సంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ‘రణబాలి’ సినిమా అక్టోబర్ 16, 2026 న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.