మోత్కూర్‌లో భావోద్వేగ ఘటన

మోత్కూర్‌లో భావోద్వేగ ఘటన
- ఇంట్లో తండ్రి శవం
- పరీక్ష కేంద్రంలో కొడుకు
- పరీక్ష రాసి వచ్చాక తండ్రి అంత్యక్రియలు
మోత్కూర్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరేళ్ల ఎల్లయ్య గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ఎల్లయ్య కు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె . చిన్న కొడుకు కూరేళ్ల హర్షవర్ధన్ స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లీషు మీడియం పాఠశాల లో పదవతరగతి చదువుతున్నాడు.
ఓ పక్క తండ్రి శవం ఇంట్లో ఉండగా..మరో పక్క దుఃఖంలో సైతం కొడుకు హర్షవర్ధన్ తొలిరోజు పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు స్థానిక సెక్రెడ్ హార్ట్ హై స్కూల్ పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష కు హాజరయ్యారు.తండ్రి మరణం లోనూ ..కన్నీటి శోకంలో సైతం కుటుంబ సభ్యుల,బంధువుల ఓదార్పు మేరకు ఏడాది కాలంగా చదివిన చదువు వృధా కావద్దని హర్షవర్ధన్ గుండెనిబ్బరంతో పరీక్షలకు హాజరు అయ్యాడు.కొడుకు పరీక్షలు రాసి వచ్చిన అనంతరం తండ్రి ఎల్లయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
