పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి (Collector Chadalavada Nagarani) కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జిల్లా ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219

భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315

నరసాపురం ఆర్టీవో కార్యాలయం .. 93911 85874.

తాడేపల్లి ఆర్డీవో కార్యాలయం .. 93817 01036, 98497 12358

తుఫాను పరిస్థితులు చక్కపడే వరకు 24/7 కంట్రోల్ రూమ్ లు పని చేస్తాయన్నారు. ప్రజలు ఏదైనా అత్యవసర సమాచారం తెలిపి, సహకారాన్ని పొందడానికి కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply