సేవలకు సెల్యూట్..
సీఐ పులి రమేష్‌కు ఘన వీడ్కోలు
ఎల్కతుర్తి పోలీసులు, జర్నలిస్టుల ఆత్మీయ సన్మానం..
విధుల్లో అంకితభావంతో సేవలందించారని ప్రశంస
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన పులి రమేష్ బదిలీ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది సీఐ పులి రమేష్‌ను శాలువా, పూలమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ నరసింహారావు, జర్నలిస్టులు మాట్లాడుతూ సీఐ పులి రమేష్ విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు విశేష కృషి చేశారని అన్నారు. నేరాల నియంత్రణలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పోలీస్ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.
బదిలీ సందర్భంగా సీఐ పులి రమేష్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, నాయకులు, జర్నలిస్టులు అందించిన ఆత్మీయ సన్మానం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. విధుల నిర్వహణలో మండల ప్రజలు, పోలీస్ సిబ్బంది అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని అన్నారు.
ఎల్కతుర్తిలో పనిచేసిన సమయంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్ సిబ్బంది, నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
