ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం.. త‌ప్పిన ప్ర‌మాదం

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్‌డెస్క్‌: ఓ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం అయిన సంఘ‌ట‌న గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ముందుగానే గ్ర‌హించి ప్రయాణికులు దిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.