Elections | నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది..

Elections | నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది..
Elections, జైపూర్, ఆంధ్రప్రభ : మూడోవ విడత నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అదే విధంగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ లకు సంబంధించి ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. జైపూర్ మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలకు గాను 134 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు ఉండగా 53 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. కాగా 81 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే 186 వార్డు సభ్యులకు 535 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 42 మంది సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 493 మంది బరిలో ఉన్నట్లు తెలుస్తుంది.
అందులో నర్వ గ్రామంలో ఒక్కరు, రామారావు పేట గ్రామంలో ఒక్కరు, గంగిపెల్లి ఒక్కరు, ఎల్కంటి ఒకరు, పౌనూర్ గ్రామంలో ఇద్దరు వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందారం గ్రామ పంచాయతీలో 13 మంది నామినేషన్ వేయగా 10 మంది నామినేషన్ లను విత్ డ్రా చేసుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరు, బీఆర్ఎస్ పార్టీ నుండి ఒకరు, అధికార పార్టీకి రెబల్ గా బరిలో ఒకరు నిలిచారు. రాబోయే ఐదారు రోజుల పాటు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగనుంది. కాగా మూడోవ విడత 17న నిర్వహించనుండగా అదే రోజు విజేతలకు ప్రకటించనున్నారు.
