ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు చూస్తున్నారని మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన పాలకుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని కామెంట్ చేశారు.
15నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని బాంబు పేల్చారు. పథకాల పేర్లు మార్చి ఎంతో అభివృద్ధి చేసినట్లుగా కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు.