నాంపల్లి ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

నాంపల్లి, ఆంధ్రప్రభ : నాంపల్లి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో ఎమ్మార్పీఎస్‌ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ మునుగోడు ఇన్‌చార్జి కుమ్మెర స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్‌ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇరికి శ్రీశైలం మాదిగ, సీనియర్‌ నాయకుడు బుషిపాక ఏడుకొండలు మాదిగ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి వేణు మాదిగ, ఉపాధ్యక్షుడిగా కందికట్టే నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పల్లేటి హరికృష్ణ మాదిగ, కార్యదర్శులుగా మారేపల్లి జనార్దన్‌ మాదిగ, మొండికత్తి అశోక్‌ మాదిగ, సంయుక్త కార్యదర్శులుగా నవీన్‌ మాదిగ, అనేపాక చంద్రమౌళి మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అనంతరం నూతన మండల అధ్యక్షుడు మారేపల్లి వేణు మాదిగ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా, మండల నాయకులతో పాటు మాదిగ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ బలోపేతానికి, సమాజ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.