Election campaign | కాంగ్రెస్ ను ఓడించలేరు..
Election campaign, నెల్లికుదురు, ఆంధ్రప్రభ : తనను గెలిపిస్తే తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని నెల్లికుదురు మండలంలోని దుర్గాభవాని తండా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి భూక్యా వీరన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని తండాలలో వున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గా భవాని తండా కాంగ్రెస్ కంచుకోట అని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరన్నారు.

