గుండెపోటుతో వృద్ధురాలు మృతి

పోలింగ్ కేంద్రం వద్ద విషాద ఘటన
క‌ర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ:
ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన ఆస్పరి మండలం హాలిగేర గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలింది. దీంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. అయితే గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడంతో హాలిగేర గ్రామంలో విషాదం అలుముకుంది. పోలింగ్ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది.