ముత్తుకూరు బిట్-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఈదూరు నామినేషన్

ముత్తుకూరు, ఆంధ్రప్రభ: స్థానిక ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ జోరుగా సాగుతుంది. రెండవ రోజు గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు వేశారు.

ముత్తుకూరు బిట్-1 ఎంపీటీసీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పార్టీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను ఎంపీటీసీ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబుకు అందజేశారు.