Education | పంచిన కొద్ది పెరిగేది విద్య….

Education | పంచిన కొద్ది పెరిగేది విద్య….
- విద్యాదానంఎంతో గొప్పది.
- విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం…
- అంబాత్రాయ శక్తిపీఠం శ్రీ ఆదిత్యపరా శ్రీ స్వామిజీ….
Education | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యతోనే ఏదైనా సాధించవచ్చని పంచిన కొద్దీ పెరిగేది విద్య మాత్రమేనని అంబాత్త్రయ శక్తిపీఠం శ్రీ ఆదిత్య పారా శ్రీ స్వామీజీ అన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్వామీజీ పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ ఉన్నత పాఠశాలలో ఉచిత బస్సు ప్రారంభోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను చదువుతోపాటు దేశభక్తి దైవభక్తి క్రమశిక్షణ నేర్పించాలనిసూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. మండలంలోని బిజ్వార్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పాతపల్లి,కొత్త పల్లి బిజ్వార్ లో చదువుతున్న విద్యార్థులు కాలినడకన నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నారని వారి ఇబ్బందులు తీర్చేందుకు తన సొంత ఖర్చులతో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
స్వామీజీ ఆయా గ్రామాలకు చదువుకునే ఎందుకు వెళ్తున్నా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసి స్వామీజీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు పద్మమ్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
