Friday, November 22, 2024

ఉపాధిలేని అభివృద్ధి ఎందుకు…

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అభివృద్ధి మెరుగు గానే ఉంది. అయితే, జనాభా దృష్ట్యా చూస్తే ఈ అభివృద్ధి చాలదు. ఏటా కొన్ని వేల మంది ఇంజనీర్లు,వైద్య పట్ట భద్రులు,ఇతర రంగాల్లో నైపుణ్యం సంపాదించిన వారు తయారవుతున్నారు. వీరంతా లక్షలాది రూపాయిలు వెచ్చించి ఎంతో శ్రమ పడి చదువుకుని ఆ పట్టాలను సంపాదించారు. అయినా ఉద్యోగాలు లేక నిరుత్సాహం తో, నిరాశా నిస్పృహలతో గడుపుతున్నారు. కొందరైతే పెడదారి పట్టి తీవ్రవాద ఉద్యమాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాలలో అన్ని దేశాల్లో పరిస్థితి గడ్డుగా ఉంది. వీటిని పొందడానికి సులభ మార్గాలు లేవు. ప్రావీణ్యం సంపాదించుకునేందుకు ఏ ఫ్యాకల్టికి చెందిన ఉద్యోగార్ధులైనా ప్రయత్నించాలి. లేని పక్షంలో వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతారు. ఈ మాటలన్న ది ఎవరో కాదు, రిజర్వు బ్యాంకు మాజీగవర్నర్‌ రఘు రామ్‌ రాజన్‌.ఆయన ఒక జాతీయ న్యూస్‌ చానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంశాలపై తన అభిప్రాయా లను పంచుకున్నారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. మన దేశంలోనే కాదు,అగ్రరాజ్యమైనఅమెరికాలో సైతం నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. ఉద్యోగాల కల్పన అనేది వాగ్దానాలు చేసినంత సులభం కాదు. ప్రభుత్వంలోకి రాగానే వాస్తవ పరిస్థితిని పాలకులు తెలుసుకుంటారు. మామూలు ఉద్యోగాలు కాదు,నైపుణ్యం కలిగిన ఉద్యో గాలకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. అలాగే, సాఫ్ట్‌ వేర్‌, వైద్యవిద్యారంగానికి చెందిన వారి కి ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి.

మన దేశంలో వైద్యవిద్యార్ధులను తయారు చేయడానికి ప్రభు త్వం లక్షలాది రూపాయిలు ఖర్చు చేస్తోంది. అయితే, ఆ విద్యను సముపార్జించిన వారు ఇతర దేశాల్లో ఆకర్షణీ యమైన ఉద్యోగాలు వస్తే వెళ్ళిపోతున్నారు. దీనినే బ్రెయిన్‌ డ్రెయిన్‌ అని పిలుస్తున్నారు. దీని వల్ల నష్టపోతు న్నది మన దేశమే. ఈ విషయమై చాలా కాలంగా మన దేశంలోచర్చ జరుగుతోంది. అయినప్పటికీ ఈ మేథో వలసను ప్రభుత్వం ఆపలేకపోతున్నది. ఇందుకు అనేక కారణాలున్నాయి. వీటిలో రాజకీయ కారణాలే ప్రధాన మైనవి. దేశ ఆర్థికాభివృద్ధి సామాజిక పరమైన పరిస్థితు లు అనుకూలంగా ఉండాలి.సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యం ఉంటేనే అభివృద్ది సాధ్యం. అభివృద్ధి అంటే అంకెల్లో కాదు. ఆచరణలో కనిపించాలి. దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక తల్లడి ల్లుతున్నారు. వారందరికీ ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ, ప్రభుత్వంలో నాయకులు చెప్పేది ఒకటి,వాస్తవ పరిస్థితి మరొకటి.ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారు నేటికీ ఎంతో మంది ఉన్నా రు. అందువల్ల ప్రభుత్వం ఉద్యోగార్ధులను ఊహాలోకా ల్లో తేలియాడేట్టు చేయడం కన్నా వాస్తవ పరిస్థితిని వివ రించడంఎంతైనా అవసరం. విదేశీ పెట్టుబడుల ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటిస్తూ ఉంటా రు. కానీ, విదేశీ పెట్టుబడులు పెట్టే వారు తాము స్థాపించే సంస్థల్లోకి ప్రతిభ,నైపుణ్యం పేరుతో తమ దేశాలకు చెంది న వారికి ఉపాధి కల్పిస్తుంటారు.అలాగే, ఒక రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారులు మరో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా స్వరాష్ట్రీయులకే ఉద్యోగాల్లో ప్రాధా న్యం ఇస్తుంటారు.దీనిని దృష్టిలో ఉంచుకుని స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వాలని ఆయా రాష్ట్రాలు తీర్మానా లు చేసినా అవి అమలుజరగడం లేదు.ఉపాధి దక్కించు కోవడం అనేదిఒక అదృష్టంగా, జాక్‌పాట్‌ భావించేవారున్నారు.

దీనికి కారణం ప్రతిభ,నైపుణ్యాలను పక్కన పెట్టి సొంత వారిని నియమించుకునేందుకు ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ప్రయత్నించడమే. ప్రైవేటు సంస్థలు పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్రాల నుంచిమౌలిక సదుపాయాల పేరిట భూములు,తక్కువ రేటుకు కరెంట్‌, నీరు, వంటివి పొందుతుంటాయి. ఆ సమయాల్లో స్థానికులకు ఉద్యోగాలిస్తామని హామీలిస్తూ ఉంటాయి. కానీ, ఆచర ణలో అది కనిపించడం లేదు. దీనిపైరాష్ట్రాల్లో అధికా రంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ సమస్య పెరగడానికి ఇది కూడాఒక కారణం. ఉద్యోగకల్పనను సాధించలేని అభివృద్ధి ఎందుకూ కొరగానిదన్న రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యల్లో ఎంతో నిజముంది.ఆయన రిజర్వు బ్యాంకుగవర్నర్‌గా పని చేసిన రోజుల్లో కూడా ఇదే మాదిరిగా నిష్కర్షగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవారు. పెద్దనోట్ల రద్దు విషయంలో కూడా రఘురామ్‌ రాజన్‌ తన అభిప్రాయా న్ని కచ్చితంగా చెప్పడం వల్లే ఆయన సర్వీసు పొడిగింపు చేయలేదన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఆయనకు విదేశీ వర్శిటీలో మంచి పదవి రాడవం వల్లనే ఆయన రిజర్వుబ్యాంకు గవర్నర్‌ పదవిని వదిలేసి వెళ్లారని తర్వాత వివరణలు వచ్చాయి. ఆర్థిక విషయాల లో నిర్మొహమాటంగా చెప్పడం ఆయన నైజం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement