Friday, November 22, 2024

పార్లమెంట్‌లో చర్చిస్తే తప్పేంటి?

దేశంఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రతిపక్షా ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రభు త్వం బాధ్యత.గతంలో అలాగే జరిగేది.కానీ,ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులు ప్రజాస్వామ్య హితైషులను కలవరపరుస్తున్నాయి. బ్యాంకుల్లో మొండిబకాయిల నుంచి చైనా సేనలు అరుణాచల్‌ ప్రదేశ్‌లో చొరబడటం వరకూ అన్ని ప్రధాన విషయాల్లోనూ ప్ర భుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటూ మంగళవారంనాడు కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఆరోపిం చాయి. బుధవారం నాడు కూడాఈ విషయమై చర్చిం చేందుకు ఉభయ సభ ల అధిపతులు అనుమతి ఇవ్వక పోవడంతో వాకౌట్‌ చేశాయి. దీని వల్ల నష్టపోతున్నది ప్రజలే. ప్రభుత్వం ఎవరు చెప్పినా వినాలి.ముఖ్యంగా ప్రతి పక్షాల అభిప్రాయలను తప్పని సరిగా వినాలి.చైనా సేనల చొర బాట్లు మన దేశానికి కొత్త కాదు. 1962లో చైనా దురా క్రమణ చేసిన నాటి నుంచి ఈ సమస్య దేశానికి తల నొప్పిలా మారింది.

అయితే, అధికారంలో ఉన్న ప్రభు త్వాలు మారినా, భారత్‌ విధానం ఎప్పుడూ ఒకే రీతిలో ఉంటోంది.దేశంలో ఒకటి,రెండు పార్టీలు చైనా దురాక్రమణ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, తర్వాత తమ తప్పును తెలుసుకున్నాయి.ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.దాదాపుగా అన్ని పార్టీలూ భారత్‌ భూభాగాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. సరిహద్దులు, ప్రాదేశిక భద్రత పట్ల ఏమాత్రం నిర్లిప్తత పనికి రాదని స్పష్టం చేస్తున్నాయి.అలాంటప్పుడు ప్రభుత్వం అందరి తో చర్చిస్తే వచ్చిన నష్టమేమిటి?పైగా ఇప్పుడు పార్ల మెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి పక్ష నాయకులను ప్రత్యేకించి ఆహ్వానించనవసరం లేదు. ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయకపోయినా, కనీసం పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోం దన్న అపప్రథను కొని తెచ్చు కుంటోంది.చైనా , పాకిస్తాన్‌ లు రెండూ మనకు సరిహద్దు దేశాలే అయినా శత్రు దేశా లు గానే వ్యవహరిస్తున్నాయి. మన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నాయి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ రెండు దేశాలతో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలను అవి కాలరాస్తున్నాయి.ఈ రెండు దేశాల వైఖరిని ఎండగట్టడంలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండననసరం లేదు.అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో యాంగ్జే ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా సేనలు మన భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించినప్పుడు వాటిని మన సేనలు తరిమి కొట్టా యంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు వివరణ కోరినప్పుడు తగిన రీతిలో స్పం దించడం ప్రభుత్వ కర్తవ్యం.అయితే,ఉభయ సభల్లోనూ సభాపతులు తిరస్కరించడం ఏకపక్షమే. ఇది ప్రభుత్వంపై విమర్శో, లేదా అవినీతికి సంబంధించిన విషయమో కాదు.యావత్‌ భారత జాతిని కలవర పెట్టే విషయం.అలాంటప్పుడు చర్చించేందుకు ఎందుకు వెనకాడాలన్నది ప్రతిపక్షాల ప్రశ్న.నిజానికి ఈ అంశంపై ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించేందుకు ప్రతి పక్షాలు సుముఖంగా ఉన్నాయి. ప్రభుత్వం మొండిపట్టు వల్లనే వాకౌట్‌ చేశాయి.

- Advertisement -

సరిహద్దు సమస్యపై భారత్‌లో అధికార,ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదన్న విషయం బాహ్య ప్రపంచానికి ఎటువంటి సంకేతాలను ఇస్తుంది?. ఈ విషయంకూడా ప్రభుత్వం ఆలోచించకపో వడం దురదృష్టకరం. ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం ఏకపక్షం గానే వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆరేళ్ళక్రితం పెద్ద నోట్ల రద్దు విషయంలో తమ అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసు కోలేదని ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. అలాగే, ఆక్రమిత కాశ్మీర్‌లో బాలాకోట్‌ ప్రాంతంలో పాక్‌ సైన్యానికీ, మన సైన్యానికీ జరిగిన ఘర్షణల వివరాలను పూర్తిగా పార్లమెంటుకు తెలియజేయకుండా,దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని వామపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తు న్నాయి. ఇటు చైనా, అటు పాకిస్తాన్‌ రెండూ మన భూభాగాల్లోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించి నప్పుడు మన సైనికులు తరిమి కొట్టడం దేశ ప్రజలం దరికీ గర్వకారణమే. ఈ విజయం ఏ ఒక్క పార్టీదో కాదు. పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో దివంగత ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి మన సేనల ధైర్య సాహసాలను కీర్తిస్తూ వారిని మరింత ఉత్సాహ పర్చేందుకు జై-జవాన్‌. జై- కిసాన్‌ అనే నినాదాన్ని ఇచ్చారు.

ఆనాడు ఆయన మన సేనల త్యాగాలనూ, సామర్ధ్యాన్నీ తన వ్యక్తిగత ఖాతా లో, లేదా, తాను ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ ఖాతా లో వేసుకునేందుకు ప్రయత్నించలేదు. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా యావత్‌ భారత ప్రజా నీకం అండదండలతో,మద్దతుతో తీసుకునేదే. అందు వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఈ తాజా సంఘటనపై ప్రతి పక్షాలు అడిగిన వివరణలకు సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇదేమీ రహస్యం కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement