Tuesday, November 26, 2024

యుద్ధంతో ఎల్లవేళలా అనర్థమే..

దేశాల మధ్య సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటి ని సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా చర్చించుకో వాలేతప్ప యుద్ధాలు పరిష్కారం కావని రష్యా విదేశాం గ మంత్రి సెర్గీ లోవ్రోవ్‌కి మన విదేశాంగ మంత్రి జై శంక ర్‌ స్పష్టం చేశారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి ఇదే విషయం స్పష్టం చేశా రు. రష్యాతో మనకు దశాబ్దాలుగా మైత్రీ బంధం ఉంది. ఎన్నో సందర్భాల్లో రష్యా మనలను ఆదుకుంది. మిగ్‌ విమానాల నుంచి అంతరిక్షంలో ప్రయోగించే రాకెట్లు, అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించే రాకెట్లు, ఇతర అంతరిక్ష పరిశోధనారంగంలో ఆధునిక పరిజ్ఞా నాన్ని రష్యా మనకు అందిస్తోంది. బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో అమెరికా హిందూ మహాసము ద్రంలోకి యుద్ధ నౌకలను పంపినప్పుడు రష్యాయే ఆదుకుంది.

ఇలా ఎన్నో సందర్భాల్లో భారత్‌కి అండగా నిలుస్తున్న రష్యాతో మన దేశం ఏమాత్రం మొహమాటం లేకుండా ఉక్రెయిన్‌పై దాడులను ఆపాలని నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది. జైశంకర్‌ మాస్కోలో రెండు రోజుల పర్యటనకు వెళ్ళినప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవ్రోవ్‌ చేసిన మర్యాదలకు పొంగి పోకుండా, రష్యా విష యంలో మన విధానమేమిటో స్పష్టం చేశారు. ఉక్రె యిన్‌పై రష్యా దాడుల వల్ల ఆ రెండు దేశాలు మాత్రమే కాకుండా యావత్‌ ప్రపంచం నష్టపోతున్నదనే విషయా న్ని జైశంకర్‌ లోవ్రోవ్‌కి స్పష్టం చేశారు. రష్యాతో మన మైత్రి ఉభయ తారకమైనది. మన దేశం రష్యాకు అండ గా ఉంటున్నట్టే, రష్యా కూడామన దేశానికి అన్ని విష యాల్లో మద్దతు ఇస్తోంది.వాణిజ్య,పెట్టుబడుల రంగా ల్లో ఇరుదేశాల మధ్య బంధం పెరగాలని జైశంకర్‌ అన్నా రు.

అలాగే,ఇంధనరంగంలో రష్యా ఎప్పటి మాదిరిగానే భారత్‌కి సంపూర్ణ సహకారాన్ని అందజేయాలని జైశంక ర్‌ కోరారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత విష యంలో రష్యా భారత్‌ సహకారాన్ని కీలకంగా భావిస్తోం ది. ఆ విషయాన్ని కూడా జైశంకర్‌ గుర్తు చేశారు.ఇరు దేశా ల మధ్య మైత్రి సమాన గౌరవం, ప్రతిపత్తిలపై ఆధార పడి ఉందన్న సంగతిని కూడాగుర్తు చేశారు.రష్యా మన దేశాన్ని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడలేదు. మొన్నీమధ్యన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరి స్తున్న విదేశాంగ,ఆర్థిక విధానాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన నియమనిబంధనలను అమలు జేయడంలో ఈ రెండు దేశాలు అంకిత భావంతో వ్యవహరిస్తున్నాయి. ఉక్రెయి న్‌ రష్యా దాడి విషయంలో మన దేశం తటస్థంగా వ్యవ హరిస్తున్నా, రష్యా మన విధానాన్ని గౌరవిస్తోంది.

- Advertisement -

యుద్ధం పరి ష్కారం కాదనీ, మనప్రధాని, విదేశాంగ మంత్రి స్పష్టంచేసినా రష్యా ఏ మాత్రం కోపం తెచ్చుకో లేదు. రష్యా, భారత్‌ వంటి దేశాలు ఉగ్రవాదం, వాతావ రణం వంటి ప్రధాన సమస్యలపై పోరాడాలని, సరిహ ద్దు విషయాల్లో దృష్టిని కేంద్రీకరించి ఆయుధ సంపత్తినీ, ఆర్థిక వనరులను దుర్వినియోగం చేసుకోరాదని రష్యా విదేశాంగ మంత్రికి జైశంకర్‌ హితవు ఒసగారు, భారత్‌ తరతరాలుగా విశ్వ శాంతిని కోరుకుంటోందనీ, భారత్‌కి ఏ దేశంతోనూ విరోధం లేదని ఆయన స్పష్టం చేశారు. జైశంకర్‌ మాస్కో పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబం ధాలు మరింత మెరుగుపడవచ్చు.అపోహలు తొలగి పోవచ్చు. తాజా పరిస్థితులలో ఇరుదేశాల మైత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇరుదేశాల మధ్య దీర్ఘ కాలికమైన మైత్రి, సంబంధాలు కొనసాగాలని మన దేశం కోరుకుం టోంది ఇదే విషయాన్ని జైశంకర్‌ రష్యా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలినిస్కీకి సందేశాన్ని పంపాలని జైశంకర్‌ కోరారు. ఎంతటి జటిలమైన సమస్య లైనా చర్చల ద్వారా పరి ష్కారం అవుతాయన్న వాస్తవా న్ని మరువకూడదని కూడాఆయన స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల కోసం మరో 50వేల మంది సైనికులను సిద్ధం చేసినట్టు పుతిన్‌ తెలియజేయడం పట్ల జై శంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగితే ప్రపంచ దేశాలకు వంటనూనెలు, ముడి చమురు అందక ఎన్నో అవస్థలకు గురి కావల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యాతో మనకున్న స్నేహాన్ని హితవచనాల ద్వారా రష్యా మనసు మార్చడానికే మన దేశం వినియోగిస్తోందన్న విషయం ఇప్పటికే స్పష్టమైం ది.

మరో వైపు రష్యాతో సంప్రదింపుల మార్గాన్ని తమ దేశం తెరిచే ఉంచిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులేవాన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యాతో ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటోందని చెప్పారు. రష్యాతో అమెరికాకు అనేక అంశాల్లో విభేదాలున్నాయి. అయినప్పటికీ ప్రపంచ దేశాల శాంతి,సామరస్యాలను దృష్టిలో ఉంచుకుని రష్యాతోసంబంధాలను కొనసాగిస్తు న్నట్టు జాక్‌ సులేవాన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement