Wednesday, November 6, 2024

Editorial : యుద్ధం… దౌత్యం!

సిరియాలో తమ స్థావరంపై దాడిచేసినందుకు ప్రతీ కారంగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై300లకు పైగా డ్రోన్‌లు, క్షిపణులతోదాడి జరిపింది.ఇరాన్‌ దాడిని ఖండిస్తూనే అరబ్‌ దేశాల్లో ముఖ్యమైన జోర్డాన్‌ సహా పలు దేశాలు ఇంాన్‌ని మందలించాయి. అంతకుముందు, సిరియా లో ఇజ్రాయెల్‌ స్థావరంపై జరిపిన దాడిని ఖండించిన జోర్డాన్‌ తాజాగా ఇరాన్‌ దాడిని సైతం ఖండించడం గమనార్హం.

- Advertisement -

ఇరాన్‌ దాడితో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. భారత్‌లోనూ స్టాక్‌ మార్కెట్‌ పడిపోయింది. మన స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరో వంక ఇరాన్‌ ఇజ్రాయెల్‌ ప్రైవేటు నౌకను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది.ఈ నౌకలో భారత్‌కి చెందిన 11 మంది నావికులు ఉన్నారు. వారిని విడిపించేందుకు విదేశాంగ మం త్రి జైశంకర్‌ ఇరాన్‌ మంత్రితో సంప్రదింపులు జరిపారు. ఆ నౌక ప్రస్తుతం ఇరాన్‌ లో ఉంది. అక్కడికి భారత నావికా బృందాన్నిపంపు తున్నారు. ఇజ్రా యల్‌పై ఇరాన్‌ నేరుగా దాడి చేయడం ఇదే ప్రథమం. కాగా, ఇజ్రాయెల్‌ ప్రతిదాడి చేస్తే సహ కరించ బోమని అమెరికా స్పష్టం చేసింది.జోర్డాన్‌ కూడా ఇజ్రాయెల్‌కు పాలస్తీనాపై దాడులకు స్వస్తి చెప్పాలని హితవొసిగింది.

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇంతవరకూ 33 వేల మంది మర ణించారు. అయితే, ఇరాన్‌కి చెందిన డ్రోన్‌లను కూల్చి వేసినందుకు జోర్డాన్‌ కారణం చెప్పింది. ఇజ్రాయెల్‌కి సాయప డటానికి కాదనీ, స్వీయ రక్షణకని స్పష్టం చేసింది. అరబ్‌ లీగ్‌ దేశాల్లో జోర్డాన్‌ కూడా ఉంది. పూర్వపు పాలస్తీనా ప్రాంతంపై 1948లో జోర్డాన్‌ దాడి చేసింది.ఇరాన్‌ను సమర్ధిస్తూ వచ్చిన జోర్డాన్‌ ఇప్పుడు ఈ వైఖరి తీసుకోవడానికి ఇరాన్‌ డ్రోన్‌ల దాడే కారణం గతంలో కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌, జోర్డాన్‌లు సరిహ ద్దులను తెరిచాయి. ఈఅవకాశాన్ని వినియోగించుకుని ఇజ్రాయెల్‌ 309 కిలో మీటర్ల సరిహద్దులో మూడు బెటాలియన్ల సైన్యాన్ని మోహ రించింది.ఇరాన్‌ని సమర్ధిస్తున్నందుకు తమ దేశంపై కూడా ఇజ్రాయెల్‌ దాడి చేయవచ్చన్న ఉద్దేశ్యంతో జోర్డాన్‌ ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌ జరిపిన దాడిలో డ్రోన్‌లు, క్షిపణుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్‌ కూల్చి వేసింది. ఇరాన్‌ జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది.

ఇరుపక్షాలు సంయమనాన్ని పాటిం చాలని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెరస్‌ పిలుపు ఇచ్చారు. ఇజ్రా యెల్‌పై దాడిని ఇరాన్‌ సమర్ధించుకుంది. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగంలోని 51వ అధికరణం కింద ఆత్మరక్షణ కోసం దాడి చేశామని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌ దుస్సాహసానికి దిగితే తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కాగా, తమ దేశంపై దాడి చేసిన ఇరాన్‌కి చెందిన ఐఆర్‌జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని సమితిలో ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి ఎలాడ్‌ గిర్టన్‌ భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్‌ కవ్వింపు చర్య వల్లనే తమ దేశం దాడి చేసిందని ఇరాన్‌ అధినేత ఆయుతుల్లా ఖమైనీ వెల్లడించారు.ఇజ్రాయెల్‌ చర్యకు అమెరికా ప్రోద్బలం ఉందన్న అను మానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ముదురుతున్న వివాదం వల్ల పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఏర్ప డింది. దీనిని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వివిధ దేశాల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, ఇజ్రాయెల్‌ తరఫున అమెరికా యుద్ధంలోకి దిగితే తాము ఇరాన్‌ కి మద్దతుగా సేనలను పంపుతామని రష్యా ప్రకటించింది. రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా, చైనా కూడా రంగంలోకిదిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.అయితే, ఇజ్రాయెల్‌కుసైనిక సాయం చేసినా యుద్ద రంగంలోకి తమ దేశం దిగబోదని బైడెన్‌ స్పష్టం చేశారు.ఇజ్రాయెల్‌ భారత్‌ నుంచి నిర్మాణ రంగ కార్మికులను తమ దేశానికి తీసుకుని వెళ్ళింది.యుద్ధమే వస్తే వారి భవిత వ్యంఏమిటన్న అంశంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇరాన్‌ మంత్రితో జరిపిన చర్చల్లో ఈ అంశం గురించి కూడా చర్చిం చారు. భారతీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకుం టామని ఇరాన్‌ హామీ ఇచ్చినట్టు విదేశాంగ శాఖ అధికా రులు తెలిపారు.
ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తత వల్ల పలు దేశాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇరాన్‌పై ఇంధనం కోసం ఆధారపడే దేశాలు ఇప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొం టున్నాయి. ఇరాన్‌కి మద్దతు గా హెజ్‌బొల్లా, హౌతీ తిరుగుబాటు దారులు దాడులు జరుపు తున్నాయి. వీటి వల్ల కూడా ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ, దౌత్య చర్చలు జరగాలని ఇరు దేశాలకూ భారత్‌ విజ్ఞప్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement