తైవాన్‌లో అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించడాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది.తాను తీవ్ర హెచ్చరికలు చేసినా అమెరికా బేఖాతరు చేయడం పట్ల చైనా ఆగ్రహంతో రగిలి పోతోంది.తన సత్తా ఏమిటో చూపేందుకు తైవాన్ జలసంధి వద్ద యుద్ధ అస్త్ర, శస్త్రాల ను మోహరించింది. దాంతో వాతావరణం నెలకొంది. తైవాన్ చుట్టూ ఆరు ప్రదేశాల్లో సైనికపటాలలతో దిగ్బం ధనం చేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమం టూ ప్రకటనలు చేసిన చైనా ఇప్పుడు తైవాన్‌ని ఎవరూ తాకలేరని రుజువు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. చైనా వైఖరిపట్ల తైవాన్ ప్రభుత్వం తీవ్ర అసమ్మతిని తెలియజేయడంతో చైనా పై అమెరికా నిప్పులు కక్కుతోంది. అక్రమరవాణా,మాదక ద్రవ్యాలు వంటి విషయాల్లో అమెరికాతో పరస్పర చర్యలను నిలిపి వేస్తున్నట్టు చైనా ప్రకటించింది.అగ్రరాజ్యంగా తన అజేయశక్తిని నిరూపించేందుకు అమెరికా ప్రయత్నిస్తోం ది. దీంతో తైవాన్ సమీప దేశాలు ముఖ్యంగా, జలసంధికి సమీపంలోని దేశాలు బాంబుల మోతలతో,మిసైళ్ళ శబ్దాలతో హోరెత్తి పోతున్నాయి. అయితే, కయ్యానికి కాలు దువ్వినట్టు కనిపిస్తున్నా యుద్ధానికి చైనా సిద్ధంగా లేదని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.సైనికంగా తమ దేశం కూడా అభివృద్దిని సాధించిందని ప్రకటించు కోవడానికే దాడులు చేస్తోందన్నది నిపుణుల అభిప్రా యం. తైవాన్ పొరుగుదేశాల అభ్యర్ధన మేరకు అమెరికా రంగంలోకిదిగింది.తైవాన్‌ని ఒంటరి చేయాలనుకుంటే చైనా పొరబడినట్టేనని అమెరికా పార్లమెంటు స్పీకర్ నాన్సీ పెలోసీ హెచ్చరించారు. తైవాన్‌కు అంతర్జాతీయం గా అన్ని దేశాల వారూ రాకపోకలు సాగించేందుకు స్వాతంత్య్రం ఉందనీ, దానిని ఎవరూ అడ్డగించలేరని ఆమె చైనాని దృష్టిలో ఉంచుకుని హెచ్చరించారు.చైనా చర్యలు తైవాన్‌నూ, దాని పొరుగు దేశాలనూ భయపెట్టే రీతిలో ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటో నీ బ్లింకన్ వ్యాఖ్యానించారు. చైనా తన ధోరణిని మార్చు కోకపోతే తదుపరి చర్యలకు తమ దేశం వెనుకాడ బోదని బ్లింకన్ హెచ్చరించారు. చైనాకు తన యుద్ధ కౌశలం ఎటు వంటిదో చూపించేందుకే అమెరికా ఈ వారారంభంలో అఎn్గాన్‌లో అల్‌ఖైదా అధినేత జవహరి తలదాచుకున్న స్థావరంపై మిసైల్ దాడిచేసి ఆతడిని మట్టుబెట్టింది. ప్రపంచంలో ఏ మూలనైనా తనఆధిపత్యాన్ని అడ్డుకునే శక్తి ఏ దేశానికీ లేదని రుజువు చేయడానికి అమెరికా ఇటీవ ల ఈ మాదిరి చర్యలను చేపట్టింది.నిజానికి తైవాన్ సమస్యకూ, తాలిబన్ల రక్షణలోతలదాచుకున్న అల్‌ఖైదా అధినేత అల్ జవహిరీకీ ఎటువంటి సంబంధం లేదు. తన సైనిక శక్తినీ, దాడుల పాటవాన్నీ గుర్తెరిగింపజేయ డం కోసమే అమెరికా ఈ చర్యకు ఒడిగట్టిందన్నది విశ్లేష కుల అభిప్రాయం.అంతేకాదు,తైవాన్ విషయంలో కవ్విస్తే తిప్పికొట్టేందుకు సిద్ధమేనని చైనాను పరోక్షంగా హెచ్చరించడమే అమెరికా ఉద్దేశ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తైవాన్‌పై అమెరికా ప్రదర్శిస్తున్నది నిజానికి కపట ప్రేమే. తైవాన్ లోనూ,దాని చుట్టు పక్కల గల ఖనిజాలనూ, వనరులపై ఆశతోనే అమెరికా తైనాన్‌ని సమర్ధిస్తున్నది. చైనా ఉద్దేశ్యం కూడాఅదే.తైవాన్ ఎల్ల కాలం తమ దేశంపై ఆధారపడి ఉండాలని చైనా కోరు కుంటోంది.ఒకప్పుడు చైనా మీద ఆధారపడినా తైవాన్ ఇప్పుడు అనేక విషయాల్లో చైనాను మించి పోతున్నది. చైనా గుర్రు అదే.హాంకాంగ్ విషయంలోనూ చైనా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నది.ఈ రెండూ తమ అంతర్భాగాల నీ, తమ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలని చైనా ఆకాంక్షిస్తున్నది. అందుకే చైనా వైఖరిని ప్రపంచంలోని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో రష్యాది ఇదే తంతు. ఉక్రెయిన్ ఒకనాడు సోవియట్ రష్యాలో అంతర్భాగమైన మాట నిజమే కావచ్చు,కానీ, సోవియట్ యూనియన్ కకావికలైన తర్వాత అజర్‌బైజా న్ వంటి ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగి స్తున్నప్పుడు ఉక్రెయిన్‌ని తొక్కి పట్టాలన్న ఆధిపత్య ధోరణిని రష్యా ప్రదర్శిస్తున్నట్టే, తైవాన్‌ని తొక్కి పట్టి ఉంచాలని చైనా చూస్తోంది. తైవాన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరకుండా చైనా అడ్డుకుంది. వాస్తవానికి చైనా కు ఈ విషయంలో హక్కు లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చేరలేకపోవడం వల్ల తమ దేశం కరోనా సమయంలో ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్‌లు,మందులను తెప్పించు కోలేకపోయిందని తైవాన్ అధ్యక్షురాలు త్సై లింగ్ వెన్ అన్నారు.తైవాన్‌కి అందవలసిన వ్యాక్సిన్లను చైనా అడ్డు కుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అలాగే, తైవాన్ అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధా లు నెరపకుండా చైనా అడ్డుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తైవాన్ స్వతంత్ర ప్రతిపత్తికి చైనా అడుగడు గునా అడ్డు పడుతోంది. తైవాన్‌లో పర్యటించినందుకు అమెరికా పార్లమెంటు స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement