Tuesday, November 26, 2024

ఖాతరు చేయని తైవాన్‌

పాకిస్తాన్‌లో పాలకులు తమకు సమస్యలు ఎదురైనప్పుడు ఆక్రమిత కాశ్మీర్‌ గురించి మాట్లాడటం ఎలా అలవాటు చేసుకున్నారో, చైనా పాలకులు ఎదురుగాలి వీచినప్పుడల్లా తైవాన్‌, హాంకాంగ్‌ల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే, అరుణాచల్‌ ప్రదేశ్‌ గురించి కూడా. నిజానికి అటు పాకిస్తాన్‌కి కానీ, ఇటు చైనాకి కానీ, తమ పొరుగు దేశాల గురించి మాట్లాడే అధికారం, హక్కు లేదు. చైనాలో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో పార్టీ అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రసంగం యావత్తూ తైవాన్‌, హాంకాంగ్‌లపైనే కేంద్రీకృతం అయింది. ముఖ్యంగా తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమనీ, హాంకాంగ్‌ని దారికి తెచ్చినట్టే, తైవాన్‌ని కూడా తెస్తామని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. జిన్‌పింగ్‌ అధికారంలోకి రాక ముందు నుంచి చైనీస్‌ పాలకులు తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారు. తైవాన్‌కి అమెరికా మద్దతు ఉంది. తైవాన్‌ చైనాకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపం అయిన మాట వాస్తవమే కానీ, బ్రిటిష్‌ వారి కాలం నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు తైవానీయులు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. చైనాలో విలీనం కావడానికి వారు అంగీకరించడం లేదు. సార్వభౌమాధికారం గల దేశంగా కొనసాగాలన్నదే తమ ఆకాంక్ష అని నిర్ద్వంద్వంగా స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

అయితే తైవాన్‌ ఏనాడూ చైనాతో కలిసి లేదు. ఉన్న కొద్ది కాలంలో కూడా ఘర్షణలు జరిగేవి. తైవాన్‌ సహజ సంపదను దోచుకునేందుకు చైనా దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా, తైవానీయుల స్వాతంత్య్ర కాంక్ష, జాతీయ భావం, కారణంగా చైనీస్‌ నాయకుల కల సాకారం కావడంలేదు. తైవాన్‌లో ఇనుము, తగరం వంటి అమూల్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఆ సహజ సంపదనంతా కొల్లగొట్టు కుని పోవాలన్నది చైనా ఆశ. చైనాకు పొరుగుదేశాల భౌగోళిక ప్రాంతాలనూ, సహజవనరులను స్వంతం చేసుకోవాలన్న కాంక్ష బలీయంగా ఉండటం వల్లనే దక్షిణ చైనా సముద్రంలోని దీవుల్లో అపారంగా లభించే చమురు, సహజవాయు నిల్వలను దోచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ దీవుల్లో సహజ సంపదపై చైనాకు ఎంత హక్కు ఉందో, తమకూ అంతే హక్కు ఉందని వియత్నాం, ఇండోనేషియా వంటి తీర ప్రాంత దేశాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. తైవాన్‌ విషయంలో తమ దేశం మెత్త పడినట్టు వచ్చిన వార్తలను జిన్‌పింగ్‌ తోసిపుచ్చారు. తైవాన్‌ని కైవసం చేసుకోవడాని కి ఎందాకైనా వెళ్తామనీ, సైనిక చర్యకు సైతం వెనుకాడ బోమని ఆయన స్పష్టం చేశారు. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమంటూ చైనా గతంలో కూడా ఇలాగే ప్రకట నలు చేసింది. తైవాన్‌ని చైనా కవ్విస్తోంది.

చైనా వైఖరి తెలుసున్న కారణంగా తైవాన్‌ సంయమనాన్ని పాటి స్తోంది. కొద్ది నెలలక్రితం అమెరికా పార్లమెంటు అధ్యక్షు డు నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించినప్పుడు తైవాన్‌ పై తీవ్రమైన దాడులతో ప్రజలను తీవ్ర స్థాయిలో భయ భ్రాంతులను చేసింది. తైవాన్‌కి చైనా గర్జింపులు, హూంక రింపులు మొదటి నుంచి అలవాటే. ఇప్పుడు కూడా జిన్‌పింగ్‌ హెచ్చరికలను తైవాన్‌ అధ్యక్షురాలు త్సైలింగ్‌ వెన్‌ కొట్టి పారేశారు. ఎన్ని త్యాగాలైనా చేసి తమ సార్వ భౌమాధికారాన్ని తైవాన్‌ కాపాడుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. హాంకాంగ్‌లో ప్రజలు చైనాతో కలిసి ఉండటానికి అంగీకరిస్తున్నారంటూ జిన్‌పింగ్‌ చేసిన ప్రకటనను ఆమె కొట్టివేశారు మూడోసారి అధ్యక్ష పదవి కి ఎన్నికయ్యేందుకు జిన్‌పింగ్‌ ఎన్ని అబద్ధాలైనా ఆడతా రని ఆమె అన్నారు. జిన్‌పింగ్‌ అధికారంలోకి రాకముం దు చైనీయులు,తైవానీయుల మధ్య ఉద్రిక్తత లేదనీ, ప్రజ లను రెచ్చగొట్టడం, సహజ సంపదను దోచుకోవడం, తైవాన్‌ను అన్ని విధాల అణచివేయడం జిన్‌పింగ్‌ చేస్తు న్న రాజకీయంగా కనిపిస్తోందని ఆమె అన్నారు. తైవానీ యులు ఎవరితోనూ గొడవపడటానికి ఇష్టపడరనీ, జిన్‌పింగ్‌ ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.

అమెరికాతో కానీ, మరే దేశంతోనైనా కానీ, తమకు సమస్యలు లేవనీ, ఎవరి ఒత్తిళ్లకు తాము లొంగ బోమని ఆమె స్పష్టం చేశారు.చైనీయులతో తమ కు విరోధం లేదనీ,ఇరుదేశాల ప్రజలు కలిసుండాలనే తాము కోరుకుంటున్నామని అయితే, ఉద్రిక్తతలు సృష్టిం చేందుకు ప్రయత్నిస్తే గట్టి సమాధానంఇస్తామని ఆమె హెచ్చరించారు. తైవాన్‌లో 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారనీ, తమ భవిష్యత్‌ని వారే నిర్ణయించుకుంటార నీ, తాము ఎవరినీ బలవంత పెట్టబోమని అన్నారు. చైనా ఉడత ఊపులకు తాము బెదరబోమని ఆమె స్పష్టం చేశారు. తైవాన్‌ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికే సంసిద్ధతను ప్రదర్శించాలని చైనా ఆయుధ బలాన్ని, సైనిక బలాన్ని ఉపయోగించి తమ దేశాన్ని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందని, అయితే అది పగటి కలేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement