Saturday, November 23, 2024

నేటి సంపాదకీయం – యుద్ధ మేఘాలు!

యెమన్‌కి చెందిన హౌతీ ఉగ్రవాదులు సోమవారంనాడు అబూధాబి విమానా శ్రయం సమీపంలో చమురు క్షేత్రాలపై జరిపిన డ్రోన్‌ దాడికి ప్రతీకారంగా సౌదీ సంకీర్ణ దళాలు మంగళవారంనాడు యెమన్‌ రాజధాని సానాలో హౌతీ ఉగ్రవాదుల స్థావరాలపై అగ్నివర్షం కురిపించాయి.సౌదీ అరేబియా కీ,ఇరాన్‌కీ చాలాకాలంగా కొనసాగుతున్న వైరం ఈ దాడులతో ప్రత్యక్ష యుద్ధంగా మారింది. హౌతీ ఉగ్రవాదులు షియా తెగకు చెందిన వారు.వారికి ఇరాన్‌ నుంచి ఆయుధ, ఆర్థిక సాయంఅందుతోంది. సౌదీ అరేబియాలో సున్నీ తెగకు చెందినవారు అధికారంలో ఉన్నారు.షియా,సున్నీలకు మధ్య వైరం కారణంగానే సిరియాలో ఏళ్ళ తరబడి యుద్ధం సాగుతోంది.చమురు వ్యాపారంలో ఆధిపత్య ధోరణి వీరి వైరానికి ఆజ్యం పోస్తోంది. సౌదీకి అమెరికా మద్దతు ఉంది. అలాగే, ఇరాన్‌లో అధికారంలో ఉన్న షియాలకు రష్యా మద్దతు ఉంది.

సోమవారం హౌతీ తిరుగుబాటుదారులు ఈ నేపథ్యంలోనే అబూధాబీ చమురు క్షేత్రంపై దాడి చేశారు.అబూధాబీ చమురు క్షేత్రాల్లో భారతీయులు,పాక్‌ జాతీయులు ఇంకా ఆసియా దేశాలకు చెందినవారుపలువురు ఉద్యోగాలు చేస్తున్నారు. సోమవారం నాడు జరిగిన డ్రోన్‌ దాడిలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీయుడు మరణించారు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మంగళవారంనాడు యెమన్‌ రాజధాని సానా నగరంపై పలు చోట్ల జరిపిన దాడిలో20 మంది మరణించినట్టు చెబుతున్నప్పటికీ, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చనని హౌతీఉగ్రవాదవర్గాలు తెలిపాయి. సౌదీ అరేబియా మొదటి నుంచి తమ పట్ల ప్రదర్శిస్తున్న దాష్టీకానికి ప్రతీకారంగానే సోమవారం అబూధాబీ విమానాశ్రయం సమీపంలోని చమురు క్షేత్రాలపై దాడి చేసినట్టు హౌతీ ఉగ్రవాదులు బహిరంగంగానే ప్రకటించారు. సిరియాలో మాదిరిగానే షియా, సున్నీ తెగల మధ్య రగులుతున్న ద్వేషానికి అమెరికా ఆజ్యం పోస్తోంది. సౌదీఅరేబియాతో అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.

అయితే, సౌదీ జరిపే దాడులతో భాగస్వామ్యం కాబోమని బరాక్‌ ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా స్పష్టం చేసింది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియాతో సాన్నిహిత్యం కారణంగానే సిరియాలో అంతర్యుద్ధానికి అమెరికాఆజ్యం పోసింది.ఇప్పుడు జో బిడెన్‌ అధ్యక్షుడైన తర్వాత అమెరికా తన విధానాన్ని ప్రకటించకపోయినా, సౌదీ పాలకులు దూకుడును ప్రదర్శిస్తు న్నారు. అయితే, హౌతీ ఉగ్రవాదుల దాడులను బహరైన్‌, ఖతర్‌ తదితర దేశాలు ఖండించా యి. ఈ దేశాలన్నీ సున్నీల పాలనలో ఉన్నాయి. సిరియాలో అంతర్యుద్ధం కూడా మొదట స్థానిక సమస్యలపైనే ప్రారంభమైంది. దానిని సున్నీ, షియాల మధ్యవైరంగా చిత్రీకరిం చేందుకు అమెరికా చిచ్చు పెట్టింది.ఇప్పటికీ అదే రాజుకుంటోంది. ఇరాన్‌ పై దాడి చేసేందుకు ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, బిడెన్‌ అధికారంలోకి రాగానే ఇరాన్‌తో యుద్ధానికి సన్నద్ధం కాబోమని స్పష్టం చేశారు. ఇతరదేశాల్లో జోక్యం వల్ల అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయిందన్న విషయాన్ని ఆయన అఎn్గానిస్తాన్‌ నుంచి సంకీర్ణ సేనల ఉపసంహరణపై చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

నిజానికి ఆఫ్గాన్‌లో ఇరవై ఏళ్ళ పాటు సంకీర్ణ సేనలను కొనసాగించడం వల్ల ఆర్థికంగా అమెరికా ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు అఎn్గాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టి మళ్ళీ పాతపద్దతుల్లోనే మహిళలు ,పిల్లలపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. కరోనా, ఒమిక్రాన్‌లతో సతమతమ వుతున్నందున ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం అమెరికాకు లేదు.అయితే, సౌదీఅరేబియా నుంచి వస్తున్న ఒత్తిడులకు అమెరికా లొంగిపోతున్నదేమో ననిపిస్తోంది. చమురు రంగాన్ని శాసిస్తున్న ఒపెక్‌ దేశాలన్నీ సౌదీఅరేబియా నేతృత్వంలోనే ఉన్నాయి.యెమెన్‌,బహరైన్‌, తదితర దేశాలన్నీ సౌదీ అరేబియా ప్రేరణతోనే పని చేస్తున్నాయి. హౌతీ ఉగ్రవాదుల గుర్రుకు అదే కారణం. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాన్‌, అండ్‌ సిరియా (ఐఎస్‌ఐస్‌-ఐసీస్‌) ఉగ్రవాదులు కూడా సౌదీపై కోపంతోనే దాని మిత్ర దేశాలపై దాడులు చేస్తున్నాయి. యెమన్‌లోని హౌతీ స్థావరాలపై యూఏఈ దళాలు జరిపిన దాడుల కు హౌతీ ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement