Friday, November 22, 2024

నేటి సంపాదకీయం – రష్యా బేఖాతర్‌!

ఉక్రెయిన్‌పై దాడులను వెంటనే ఆపాలన్న అంతర్జాతీ య న్యాయస్థానం ఆదేశాన్ని రష్యా పెడచెవిన పెట్టింది. ఆ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన రోజునే ఉక్రెయి న్‌పై రష్యా దళాలు బరితెగించి జరిపిన దాడిలో 12 వంద ల మంది మరణించారు. వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరో వంక రష్యాతో తమ ప్రతినిధులు జరుపు తున్న చర్చలు ఫలించకపోవడానికి రష్యా అనుసరిస్తున్న పెడవైఖరే కారణమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఎప్పటికప్పుడు కొత్త షరతులను తెస్తూ ఈ చర్చలు స్తంభించడానికి రష్యా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఆయన మాట అలా ఉంచితే, చర్చలు జరుపుతున్న సమయంలో రష్యా దాడులు జరపడమే మిటని ప్రపంచ దేశాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై కోపం ఉండవచ్చు, కానీ, ఉక్రెయిన్‌ పౌరులు ఏం నేరం చేశారు? ముఖ్యంగా, పిల్లలు, వృద్ధులు అనే తేడా చూపకుండా రష్యన్‌ దళాలు జరుపుతున్న దాడు లు పరమ జుగుప్సాకరంగానూ, అమానుషంగానూ ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయసూత్రాలనూ, మర్యాదలనూ, ఒప్పందాలనూ మంటగలుపుతున్న రష్యా ప్రపంచంలో ఇప్పడు ఏకాకి అయింది. ఆంక్షల వల్ల ఇప్పటికే బాగా నష్టపోయింది.

అయినా లెక్క చేయని రీతిలో రష్యా దాడులు జరపడాన్ని ప్రపంచంలో శాంతి కాముకులంతా ఖండిస్తున్నారు. ఉక్రెయిన్‌ ధోరణిని గతంలో విమర్శించిన వారు సైతం ఇప్పుడు రష్యా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉక్రెయిన్‌ సైనికులు జరుపుతున్న వీరోచిత పోరాటం భావితరాలకు ఆదర్శమ ని యుద్ధ నిపుణులు ప్రశంసిస్తున్నారు. అమెరికా ఈ రెండు దేశాల మధ్య అగ్గి అంటించి ఇప్పుడు ధర్మప న్నాలు వర్ణిస్తోంది. ఉక్రెయిన్‌ పౌరులపై అమెరికాకు నిజంగా ప్రేమ ఉంటే దాడులను ఆపించేందుకు తన శక్తి సామర్ధ్యాలను వినియోగించి ఉండేది. అమెరికా అధ్యక్షు డు జో బిడెన్‌ అనుసరిస్తున్న తటస్థ వైఖరిపై అమెరికన్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత మారణ హోమం జరుగుతున్నా, అమెరికా కేవలం హెచ్చరికలకే పరిమి తం కావడం పట్ల అమెరికన్లు కుతకుత ఉడికి పోతున్నారు.

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ ప్రతినిధి కూడా రష్యా వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యు న్నత న్యాయస్థానం హెచ్చరించినా పుతిన్‌ మొండిగా యుద్ధం సాగించడం పట్ల రష్యన్లకే అసహ్యం కలుగు తోంది. తమ దేశంపై ఉక్రెయిన్‌ వంటి పొరుగు దేశాలను ఉసికొల్పుతున్న అమెరికాపై ఇంతవరకూ ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యన్లు ఇప్పుడు పుతిన్‌ మొండి వైఖరిని తూర్పార బడుతున్నారు.14 వందల మంది రష్యన్‌ సైనికులను మట్టుబెట్టామనీ, వందలాది ట్యాంకులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని ఉక్రెయిన్‌ రక్షణాధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌ గా ప్రకటించాలన్న తమ డిమాండ్‌ని అమెరికా, ఇతర దేశాలు పట్టించుకోకపోవడం వల్లనే రష్యా ఇంతగా చెలరేగి పోతోందని ఉక్రెయిన్లు వాపోతున్నారు. ముఖ్యం గా, అమెరికాపై వారు తమ కోపాన్ని బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. అలాగే, చైనా కూడా రష్యాతో తనకు గల వాణిజ్య సంబంధాలు చెడిపోరాదనే గట్టిగా గర్జించ డం లేదని నిపుణులు భావిస్తున్నారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా చమురు శుద్ధి కర్మాగారాలను కలిగి ఉన్న రిలయన్స్‌ సంస్థ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయరాదని నిర్ణయించింది.అవసరమైతే మధ్యప్రాచ్య దేశాలనుంచి, లేదా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటామని రిలయన్స్‌ వర్గాలు పేర్కొన్నా యి. అమెరికాను ఇరుకున పెట్టేందుకు రష్యా ఇప్పటికి ఎన్నో యత్నాలు సాగించింది. అయినప్పటికీ రష్యాను ఏకాకిగా చేయాలన్న లక్ష్యంతో అమెరికా రష్యా పట్ల సైనిక పరమైన చర్యకు దిగడం లేదు. అదే జరిగితే మరో ప్రపం చయుద్ధం వస్తుందని వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. యుద్ధమంటే అమెరికాకు ఇష్టం లేదు. ఇరాక్‌,అఎn్గాన్‌ దేశాలపై దాడులు జరిపించిన అమెరికా ఎన్నో ట్రిలియన్ల ఆర్థిక నష్టాన్ని చవిచూడటమే కాకుండా,పెట్టుబడులు వచ్చే అవకాశాలు మూసుకుని పోవడంతో ఈసారి కర్ర విరగకుండా, పాము చావకుండా వైఖరిని అనుసరిస్తోం ది.

అయితే,అమెరికా అనుసరిస్తున్నఈ వైఖరి వల్ల భవిష్యత్‌లో వాణిజ్య రంగంలో పెను సవాళ్ళను ఎదు ర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ సైనికులు అమెరికా అందించిన ఆయుధాలతో రష్యన్‌ సైనికులను ఢీకొంటున్నారు. రష్య న్‌ సైనికుల్లో నైతిక బలం క్రమంగా తగ్గుతోంది. ఇరాక్‌లో అమెరికాతో కలిసి దాడులు జరిపినప్పుడు బ్రిటన్‌ సైనికు లు ఇదే మాదిరిగా సాయం అందించారు. దాంతో బ్రిటన్‌ లో తీవ్రవ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు అమెరికాలో కూడా అదే పరిస్థితి. రష్యా యుద్ధం ఎటు దారి తీస్తుందో నని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement