Friday, November 22, 2024

నేటి సంపాదకీయం-ధరాఘాతం.. ఎవరి పాపం?

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి,ఇతర మంత్రులు చేస్తున్న ప్రకటనల్లో వైరుధ్యం కనిపిస్తోంది.కరోనా ముందునాటి స్థితికి ఆర్థిక పరిస్థితి పుంజుకుందని ఒకరు, టోకు ద్రవ్యోల్బణం పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం లేదని మరొకరు చేసిన ప్రకటనలు ప్రజలను గందరగోళంలోకి నెట్టుతున్నాయి. గత సం వత్సరం కన్నా ఈ ఏడాది ఎగుమతులు 55శాతం పెరిగి 30 లక్షల కోట్లకు చేరుకోవచ్చని కేంద్ర మంత్రి పియూష్‌ గోయెల్‌ ప్రకటించారు.ఎగుమతులు పెరగడం వల్లనే దేశం ఆర్థి కంగా పుంజుకుందని భావించడంలో తప్పులేదు.అయితే ఆ ఎగుమతులు ఉత్పత్తులకు సం బంధించినవి కావు.సేవలకు సంబంధించినవి.అలా తీసుకున్నా సేవారంగంలో ఉద్యోగాల సృష్టి గతంలో కన్నా ఏమంత ఎక్కువగా పెెరిగిన దాఖలాలు లేవు. ఆదాయం పెరిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఎందుకుందో పాలకులే చెప్పాలి. ఉత్పత్తి అంటే ప్రజల మన సులో మెదిలేది మొదట వ్యవసాయ రంగమే.

వ్యవసాయ రంగం ఏ తీరుతెన్నుల్లో ఉందో ఇటీవల వరకూ నిరవధికంగా సాగిన రైతుల ఆందోళన తేటతెల్లం చేస్తోంది.రైతుల పంటను కొనే నాథుడు లేడు.ప్రభుత్వం వేయమన్న పంటలనే వేసినా వాటికి కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు.దాంతో కనీస మద్దతుధర కోసం రైతులు సాగిస్తున్న ఆందోళనలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం . అకాల వర్షాలు, తుపా నుల కారణంగా పండ్లతోటలు, కూరగాయల తోటలు కూలిపోయి రైతుకు నష్టం చేకూరుస్తు న్నాయి.వరి విషయంలో ఇటీవల ఎన్నడూ లేని విధంగా పోరు సాగు తోంది. ఉద్యోగాల సృష్టిలో ప్రధానపాత్ర వహించే చిన్న,మధ్యతరహా పరిశ్రమలు భారీ వర్షా లకు దెబ్బతి న్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితే ఇందుకు నిదర్శనం.ఇతర రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలు మూలపడినట్టు వార్తలు వస్తున్నాయి.కార్పొరేట్‌ సంస్థలు,పెద్ద పరిశ్రమలలో ఉద్యోగాలు లభించడం ఎంత కష్టమో ఉద్యోగార్ధులు తరచు చేసుకునే ఆత్మహత్యలు నిదర్శ నం.,

స్వయంసహాయక సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆంక్షలు పెరిగిపోతు న్నాయి. రిజర్వు బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని ప్రస్తుత ప్రభుత్వం తగ్గించిందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ద్రవ్యోల్బణం పెరగడటానికి బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ జోక్యం పెరగడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి.ఉత్పత్తి పెరుగుతున్నా ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండకపోవడానికి కారణాలపై ప్రభుత్వం తరచూ సమీక్షించాలి.వినియోగదారుల ఆందోళనను పురస్కరించుకుని వంటనూనెల ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం వల్ల వాటి ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి.సామాన్యులకు అవసరమైన ఆహార ధాన్యాలు, పప్పుల ధరలు కూడా తగ్గేట్టు చర్యలు తీసుకోవాలి. అతివృష్టి కారణంగా కూరగాయల ధరలు పెరుగుతు న్నాయన్న వాదనకూడా అర్థ సత్యంగానే ఉంది. కూరగాయలను అధిక ధరలకు విక్రయిసు ్తన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం సంఘటిత రంగానికి చెందిన ఉద్యో గులు, కార్మికుల కోర్కెలను ఎప్పటికప్పుడు తీరుస్తూ సామాన్యులంటే వారేనని సం తృప్తి చెందు తున్నట్టుగా కనిపిస్తోంది.అసంఘటిత రంగం గురించి అసలు పట్టించుకోవడం లేదు. రోజు వారీ పనులకు వె ళ్ళేవారిని కరోనా దెబ్బతీసింది.అది కాస్త తగ్గిందనుకుంటుంటే, ఇప్పుడు ఒమిక్రాన్‌ పేరిట మరో రూపంలో ప్రజలను కొత్త వైరస్‌ భయపెడుతోంది. దీని వల్ల ఉపాధి కోల్పోయే వర్గాలు అసంఘటిత రంగానికి చెందినవేనని వేరే చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా ఈ వైరస్‌లు వలస కార్మికుల పాలిట మహమ్మారులుగా తయారయ్యాయి. మధ్యతరగతి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వంటగ్యాస్‌ ధరలను ప్రభుత్వం పదే పదే పెంచుతుండటం వల్ల మధ్యతరగతి వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ చార్జీలు పెంచేశారు. వంటగ్యాస్‌,విద్యుత్‌ చార్జీల పెరుగుదలతో నెలవారీ బడ్జెట్‌ మరింత పెరిగి మోయలేని భారం మధ్యతరగతిపై పడుతుంది.కరవుభత్యం పెంపుతో ఉద్యోగ వర్గాలకు కొంతలో కొంత ఉపశమనం కలగవచ్చు,కానీ, అసంఘటిత రంగానికి చెం దిన వారి సంగతి ఏమిటి?వస్తు వినియోగం ఎక్కువగా జరిగేది ఈ వర్గాల వల్లనే. అదనపు భారాన్ని మోస్తున్నది ఈ వర్గాలే. వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement