ప్రభన్యూస్ : కరోనా తగ్గుముఖం పడుతున్నదని ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ మన దేశంలో కాలుపెట్టి ఒక్కసారిగా యావత్ దేశాన్నీ ఊపిరి బిగపట్టేలా చేసింది. ఈ వార్త చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది. ప్రసార సాధనాల్లో వస్తున్న వార్తలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినప్పటికీ, దీని ప్రభావం తక్కువేనని నిపుణులు ప్రకటించారు. ఒమిక్రాన్ వల్ల ఇంతవరకూ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ ఒక్కరు కూడా మరణించలేదని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీయర్ ప్రకటనంచారు. కరోనా రెండు దశల్లో కేసులు ఎక్కువగా నమోదు కావడం, వ్యాక్సినేషన్ ఉద్యమస్థాయిలో జరగడం వల్ల ఒమిక్రాన్ ప్రభావం ఉండంబోదన్న అభిప్రాయం మొదటి నుంచి వెలువడుతున్నదే. కానీ, బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనగానే జనంలో ఆందోళన బయలు మొదలయింది. తామరతంపరగా వస్తున్న అనుబంధ కథనాలు ఆజ్యంపోస్తున్నాుంఏది ఏమైనా అతి భయంతో కుంగిపోవడం. అతి ధీమాతో నిర్లక్ష్యంగా ఉండటం అనర్థహేతువే.
మన దేశంపై దీని ప్రభావం లేదనగానే నిర్లిప్తంగా ఉండాలనుకోవడం తగదు.. కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలు, మార్గదర్శకాలను కొనసాగించకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనీ, సాధ్యమైనంతవరకూ ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలనీ, అత్యవసర పరిస్థితులలోనే బయటకు వెళ్ళాలని సూచిస్తున్నారు. పదిమందిలో కలిసి తిరిగే అవసరం ఏర్పడినప్పుడు మాస్క్ ధారణ తప్పని సరి అనీ, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి గతంలో వేయించుకున్న వ్యాక్సిన్ల సమర్ధత సరిపోదన్న వార్తల్లో నిజంలేదని వైద్యశాఖ స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌కి సంబంధించిన సమాచారాన్ని వైద్య నిపుణుల నుంచి ధ్రువీకరణ పొందిన తర్వాతనే వెలువరించాలనీ, తెలిసీ తెలియకుండా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తే ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. కొత్త వేరియంట్లోని మ్యుటేషన్లు వ్యాక్సిన్ సమర్ధతను తగ్గిస్తాయన్న మాటలో నిజం లేదని కూడా స్పష్టం చేశారు.
అయితే, ఈ వ్యాక్సిన్ల సమర్ధతపై అధ్యయనాలు మరో వైపు సాగుతున్నాయి. రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నవారు ఒమిక్రాన్ బారిన పడకుండా బూస్టర్ డోస్‌లు వేయించుకునేందుకు కొన్ని దేశాల్లో జనం ముందుకస్తున్నారు. మన దేశంలో కూడా కోవీషీల్డ్‌ను బూస్టర్ డోస్‌గా గుర్తించాలని సీరం ఇనిస్టిట్యూట్ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. కేరళ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు బూస్టర్ డోస్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నికోరాయి. ఒమిక్రాన్ గురించిన సమాచారం బయటపడుతున్న కొద్దీ జనంలో ఆందోళన పెరుగుతోంది. అందుకే బూస్టర్ డోస్ కోసం డిమాండ్ పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్లు ఇంకా వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలనీ, వ్యాక్సినేషన్ సామర్ధ్యంపై వెలువడుతున్న వార్తలకు ఆధారా లు లేవని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు.
ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తలు తీసుకో వాల్సిందేననీ, అదే సందర్భంలో అనవసరమైన భయాలు పెంచుకోరాదని వైరాలజిస్టులు సూచిస్తున్నారు. పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా ప్రకారం చికిత్స పొందాలని వైరాలజిస్టులు పేర్కొంటున్నారు. మనదేశంలో 67 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నందున కొత్త వైరస్ సోకే ప్రమాదం లేదని స్పష్టంచేశారు. కరోనా రెండవ దశలో టీకాలు, ఆక్సిజన్ కొరతతో సంక్షోభం తలెత్తినప్పటికీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర వైద్య శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లు రెండుడోస్‌లు తీసుకున్న వారు 80 శాతం మంది ఉన్నారు. సంపన్న దేశాల్లో 60 శాతం టీకాలు పూర్తి అయ్యాయి. పేద దేశాల్లో మూడుశాతమే వ్యాక్సినేషన్ జరిగింది. అందుకే అక్కడ మొదట ఈ వైరస్ బయటపడింది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital