Tuesday, November 26, 2024

Today’s Editorial – మోడీ గ‌డుసు స‌మాధానం…

ప్రపంచంలో అన్ని దేశాలూ సామరస్యంతో, శాంతియుతంగా సహజీవనం సాగించాలన్నదే భారత అభిమతమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణలకు తావిచ్చే అంశాలకూ, ఘర్షణ లకు పాల్పడే దేశాలకూ భారత్‌ మద్దతు ఇవ్వ బోదని కూడా స్పష్టం చేశారు.అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆయన ఉక్రెయిన్‌పై భారత వైఖరిని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌ తటస్థంకాదనీ, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని భారత్‌ గట్టిగా విశ్వసిస్తోందనీ, ఈ విషయాన్ని రష్యా, ఉక్రెయిన్‌లకు పలు సందర్భాల్లో స్పష్టం చేశామని ఆయన అన్నారు. ప్రధాని మాటల్లో అర్థ సత్యం ఉంది. ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్న కారణంగా ఆయన స్వరంలో కొద్దిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతవరకూ ఉక్రెయిన్‌పై భారత్‌ది తటస్థ విధానమేనని ప్రధానమంత్రే కాకుండా, విదేశాంగ మంత్రి జయశంకర్‌, ఇతర ప్రముఖులు చెబుతూ వచ్చా రు.
ఇప్పుడు మేం త టస్థం కాదు, శాంతి వైపు నిలబడు తున్నాం అని అన్నారు. అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలని కూడా అన్నారు. పరోక్షంగా రష్యాను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నట్టు వేరే చెప్ప నవసరం లేదు. రష్యాతో మన దేశానికి దశాబ్దాలకు పైగా మైత్రి ఉంది.పాత చరిత్ర అలా ఉంచితే, ప్రస్తుత సంక్షోభంలో కూడా మనకు రష్యా గరిష్టస్థాయిలో చమురును సరఫరా చేస్తోంది. రష్యాలో ఉత్పత్తి అవుతు న్న చమురు నిల్వల్లో 80 శాతం చైనా, భారత్‌లకే సరఫరా చేస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఇటీవల ప్రకటించా రు. అయితే, రష్యా అగ్రరాజ్య హోదాని చాలా కాలం కలిగి ఉంది. అంత పెద్ద దేశంతో ఘర్షణ పెట్టుకోవడం ఇష్టం లేకనే మన దేశం తటస్థ మంత్రాన్ని ఇంత కాలంగా జపిస్తూ వస్తోంది. అయితే, అమెరికా పర్యటన సంద ర్భంగా పెద్దన్న గారిచేత ఈ మాట చెప్పించుకోవలసిన అవసరం లేకుండా ప్రధానమంత్రి మోడీ కాస్తంత గడుసుదనాన్ని ప్రదర్శించి ఉంటారు.

అయినా, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చాలా కీలక దశకు వచ్చాయి. ఈ తరుణంలో ఎటువైపు మాట్లాడరాదన్న దౌత్య నీతికి అనుగుణంగా ప్రధానమంత్రి సమాధానమిచ్చి ఉంటా రు. మోడీ అమెరికా పర్యటన పై చైనా తన దుగ్ధను వెళ్ళగక్కింది. చైెనా దూకుడుకు భారత్‌ని అడ్డుగోడగా ఉపయోగించుకోవాలని అమెరికా అనుకుంటోందనీ, చైనా స్థానాన్ని భారత్‌ మాత్రమే కాదు, మరే దేశమూ భర్తీ చేయలేదని చైనా దౌత్యవేత్త వాంగ్‌ యీ వ్యాఖ్యానిం చారు. ఉక్రెయిన్‌ యుద్ధానికీ, భారత్‌కి సంబంధం ఏమిటో ఆయన స్పష్టం చేయలేదు. ఉక్రెయిన్‌తోనూ, రష్యాతోనూ భారత్‌కి ఎంతో కాలంగా వాణిజ్య సంబంధాలున్నాయి. వాటినిఉపయోగించుకుని భారత్‌ తన అవసరాలకు తగిన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తప్పేమిటో చైనా వెల్లడించలేదు. నిజానికి రష్యా అంతగా రెచ్చి పోవడానికి ఉక్రెయిన్‌పై అగ్నివర్షం కురిపించడానికి చైనాఎగదోయడమే కారణమన్న సంగతి జగమంతా తెలుసు.

ప్రధానమంత్రి చెప్పినట్టు ఈ యుద్ధాన్ని ఆపించడానికి భారత్‌ ఇంతవరకూ చేసిన కృషి, ఇప్పటికీ చేస్తున్న కృషీ కూడా జగద్విదితమే. అదే సందర్భంలో అమెరికా వలలో పడవద్దనీ, కష్ట సమయా ల్లో ఆదుకోదని చైనా దౌత్యవేత్త వాంగ్‌యీ అన్నారు. ఆ విషయం గురించి చైనాతోచెప్పించుకోవల్సిన అవసరం భారత్‌కి లేదు.ఇప్పటికి ఎన్నో సార్లు అమెరికా భారత్‌ని ఏ విధంగా ఒంటరిని చేసిందో భారత్‌కి తెలుసు. అగ్ర రాజ్యంగా అమెరికా ఇరుదేశాల మధ్య దౌత్యం నెరిపి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, అలా చేయకుండా ఉక్రెయిన్‌కి క్షిపణులనూ, అత్యంత ఆధునిక ఆయుధాలను సరఫరా చేసి రెచ్చగొట్టింది. అమెరికాతో సంబంధాల విషయమై భారత్‌కి స్పష్టమైన విధానం ఉంది. అలాగే, రష్యాతో కూడా. ప్రస్తుత సంక్షుభిత ప్రపం చంలో ఏ ఒక్క దేశమూ ఒంటరిగా మనుగడ సాగించ లేదు.

అందరితో కలిసి మెలిసి ఉంటేనే మనుగడ సాధ్య మన్న సంగతి భారత్‌కి తెలుసు. ఈ భావన భారతీయ సంస్కృతిలోనే ఇమిడి ఉంది. ఉక్రెయిన్‌పై దాడులు ఆపించడానికి భారత్‌ ఇప్పటికీ చేయవల్సింది చేస్తోంద న్న మోడీ మాటలు అమెరికాను ఉద్దేశించినవే. భారత్‌ జోక్యం చేసుకోవాలని అమెరికా సమయం దొరికినప్పు డల్లా సలహాలు ఇస్తోంది. భారత్‌ ఏమీ చూస్తూ కూర్చో లేదనీ, తన పని తాను చేస్తోందని చెప్పడమే ప్రధాని ఉద్దేశ్యం. ప్రధానమంత్రి పర్యటన ఈసారి ప్రాముఖ్యత ను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు భారత్‌కు ఎక్కువ ప్రయోజనకరమని విదేశాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తు న్నారు. అయితే గతంలో అమెరికాతో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం ఒప్పందం వంటివి కుదుర్చుకుంటే మన స్వతంత్ర విదేశాంగ విధానానికి దెబ్బ తగలవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానికి అనుభవం ఉన్న దృష్ట్యా అంత తేలిగ్గా వలలో పడకపోవచ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement