ఉక్రెయిన్‌పై రష్యాదాడి నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. రష్యా దాడి ప్రభావం వల్ల చిన్న, చితకా దేశాలు ముడి చమురు కోసం గిలగిలలాడు తున్నాయి. మన దేశంలో చమురుధరలపై రష్యా దాడి ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మిత్ర దేశమైనందున రాయితీధరపై చమురు సరఫరా చేస్తామ ని రష్యా ప్రకటించింది. అది రష్యా ఔదార్యానికి నిదర్శ నం. అయితే, రష్యా రాయితీధరకు ఇచ్చే చమురును దిగుమతి చేసుకోవాలా వద్దా అనే అంశంపై మన దేశం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మన దేశం ఎక్కడ రష్యా కూటమిలో చేరిపోతుందోనన్న భయంతో అమెరికా సుతిమెత్తగా హెచ్చరించింది. భారత్ తీసుకునే నిర్ణయం వల్ల భారత్‌పై రష్యా అనుకూల ముద్ర పడే అవకాశం ఉందని సుతిమెత్తగా హెచ్చరించింది. అంటే రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆంక్షలు విధించిన కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడిని సమర్ధించినట్టు అవుతుందని అమెరికా మన మేలు కోరి సలహా ఇచ్చినట్టు వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో భారత్‌కి తన అవసరాల కోసం ఎక్కడి నుంచైనా చమురు పొందే హక్కుఉందని అమెరికా వ్యాఖ్యానించింది. అంటే అమెరికా వ్యాఖ్య అంటీముట్ట నట్టుగా ఉంది.రష్యా నుంచి 400 సి క్షిపణుల దిగుమతి చేసుకోవాలన్న భారత్ నిర్ణయం పట్ల అమెరికా గుర్రుగా ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ సందర్శించినప్పుడు కుదిరిన ఒప్పందంపై అమెరికా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఈ ఒప్పందం కుదిరినా రష్యాను భారత్ భద్రతా మండలిలో సమర్ధించలేదు. ఉక్రెయిన్‌పై రష్యాజరిపిన దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానంపై ఓటింగ్‌కి గైర్‌హాజర్ అయింది. రెండు కొండలు ఢీకొంటు న్నప్పుడు చిన్న దేశాలు నలిగి పోవడం సహజమే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన ముందున్న ప్రత్యామ్నా యాలను పరిశీలిస్తే తప్పేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నా రు. సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన మన దేశానికి ఏది మంచో, ఏదిహానికరమో బేరీజువేసుకునే హక్కు, నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఈ విషయంలో అమెరికా కానీ, రష్యాకానీ, మనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఆంక్షలు విధించడమే కాకుండా, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయరాదని మన దేశంపై కూడా ఆంక్షలు విధించారు. దీనిపై మన దేశం అప్పట్లో ఆక్షేపణ తెలియజేసింది. అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం మన దేశానికి ముందుగా తెలియజేస్తోందా? అమెరికాది అగ్రరాజ్య అహంకార ధోరణిని ప్రదర్శిస్తోంది.
రష్యాపై అన్ని దేశాలూ ఆంక్షలు విధించాయి. రష్యాను ఏకాకిగా చేయడానికి అమెరికా అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తోంది. ఈ నేపధ్యంలోనే రష్యా చమురు ను ఎరగా చూపి మిత్రులన దరి చేర్చుకోవడానికి ప్రయ త్నిస్తోందన్న విషయం అందరికీ తెలుసు.చౌక ధరకు చమురును ఇచ్చినంత మాత్రాన రష్యా చర్యలన్నింటినీ మన దేశం సమర్ధించినట్టు కాదు. అంతేకాకుండా రష్యా షరుతులేమైనా పెడితే అంగీకరించబోదు.ఇది పూర్తిగా భారత్ వివేచన పై ఆధారపడి ఉన్న విషయం.ఇటువంటి సున్నితమైన విషయాల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవ డం మంచిది కాదు. ఉక్రెయిన్‌పై సమితిఓటింగ్‌లో భారత్ తటస్థంగా ఉన్నా, రష్యా చర్యలను సమర్ధించ లేదు. రష్యానే కాదు, ఏ దేశమూ, మరో దేశంపై దాడి చేయరాదన్నది భారత్ సిద్ధాంతం.
ఉక్రెయిన్ నుంచి మన దేశం ఆయుధాల విడిభాగాలను సోవి యట్ యూనియ న్ కాలం నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో ఆయుధాల విడిభాగాలను తయారు చేసే ఫ్యాక్టరీలు బాగా దెబ్బతిన్నాయి. ఆయుధా ల విడిభాగాలను మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవా ల్సి ఉంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం వల్ల చమురు దిగుమతులకే కాకుండా, ఆయుధాల విడి భాగాల దిగుమతులకు కూడా మన దేశం ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మనకు రష్యా ఎంత ముఖ్యమో, ఉక్రెయిన్ కూడా అంతే ముఖ్యం. అందువల్ల మన దేశం ఆచితూచి అడుగు వేస్తోంది.ఉక్రెయిన్‌పై 21రోజులుగా దాడులు జరిపిస్తున్న రష్యాకి వ్యతిరేకంగా అమెరికన్ పార్లమెంటులో అధికార ప్రతిపక్ష సభ్యులు ఒక్కటయ్యారు. రష్యా చర్యను ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అమెరికాలో మాదిరిగానే దేశంలో కూడా అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచి ప్రభు త్వం తీసుకునే చర్యలకు మద్దతు ఇవ్వాలి. ఇలాంటి సమ యాల్లో అమూల్యమైన సలహాలను అందించాలి. ఉక్రె యిన్‌లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించడంలో సంయమనాన్ని పాటించినట్టే ఈ విషయంలోనూ ప్రభు త్వం సరైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశిద్దాం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..