Wednesday, November 20, 2024

నేటి సంపాదకీయం-ఉక్రెయిన్‌పై తాడోపేడో!

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌ అంతర్భాగమైన ఉక్రెయిన్‌ 1991లో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తర్వాత స్వతంత్ర దేశంగా ఏర్పడింది. 2014లో రష్యన్‌ దళాలు ఉక్రెయిన్‌లోని క్రిమియన్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకు న్నాయి. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సరిహ ద్దు ఘర్షణలు చెలరేగుతున్నాయి. 2013లో ఆనాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టోర్‌ యెనుకోవిచ్‌కి వ్యతిరేకంగా కీవ్‌లో పెద్దప్రదర్శన జరిపారు. దానిని ఆసరాగా తీసుకుని రష్యన్‌ దళాలు క్రిమియన్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. క్రిమియన్‌ ప్రాంతంలో జరిగిన జనవాక్య సేకరణలో అక్కడి ప్రజలు రష్యాతో కలిసి ఉండేందుకు అనుకూలంగా ఓటు వేశారు.ఇది రష్యా కృత్రిమంగా జరిపించిన ఓటింగ్‌ అని అమెరికా దాని మిత్ర దేశాలు ఆరోపించాయి. ఉక్రెయిన్‌కు అమెరికా 2014 నుంచి బిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించింది. క్రెమియన్‌లో రష్యన్‌ల భద్రత కోసం సరిహద్దుల్లో తమ సేనలను మోహరించిన మాట నిజమేనని రష్యా అంగీక రించింది.ఈ వాదాన్ని అమెరికా, దానిమిత్ర దేశాలు అంగీకరించడం లేదు, ఉక్రెయిన్‌ని ఆక్రమిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యాకు అమెరికా సహా ఏడు దేశాలు హెచ్చరించా యి. వీటిలో జి-7 దేశాలు ఉన్నాయి.క్రిమియన్‌లోని సహజ వనరులను దోచుకుంటున్న రష్యా, ఇప్పుడు ఉక్రెయిన్‌లోని ఇనుము,బొగ్గు,గ్రాఫైట్‌,టిటానియం వంటి ఖనిజాలపై కన్నేసిందనీ, అందుకోసమే ఆక్రమించుకోవాలని చూస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపించాయి.

యూరోపియన్‌ యూనియన్‌లో చేరేందుకు ఉక్రెయిన్‌ వ్యతిరేకిం చడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.ఉక్రెయిన్‌ సోవియట్‌ రష్యాలో అంతర్భాగం గా ఉన్నప్పుడు రష్యన్లు అనేక మంది వ్యాపార రీత్యా అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. తమ వ్యాపారాల్లో, పరిశ్రమల్లో వచ్చిన లాభాలను స్వదేశానికి తరలించుకుని పోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఇందులో రష్యన్‌ ప్రభుత్వం ప్రమేయం లేదని రష్యన్‌ ప్రభుత్వం వాదిస్తోంది.వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన 30బిలియన్‌ టన్నుల ఇనుపఖనిజం ఉక్రెయిన్‌ ప్రాంతంలో ఉంది.రష్యా పోకడలు చూస్తే 2022 రాకముందే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉన్నట్టు కనిపి స్తోందని అమెరికా మిత్ర దేశాలు పేర్కొన్నాయి.క్రెమియన్‌ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకు న్నప్పుడు అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే అంతకన్నా తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఫోన్‌లో సంభాషణలు జరిపారు. ఆ తర్వాత జి-7 దేశాలు రష్యా వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ మాటకు వస్తే ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి అమెరికన్‌ సేనలు, యుద్ధ సామగ్రి చేరుకున్నాయని రష్యా ఆరోపించింది.

తమ సేనలు తమభూభాగాన్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని రష్యా స్పష్టం చేసింది.ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.రష్యా వెనుక చైనా ఉందనే అనుమానాన్ని అమెరికా దౌత్యవేత్తలు వ్యక్తంచేశారు. అమెరికా, చైనాల మధ్య నానాటీ వైరం పెరుగుతున్న నేపధ్యంలో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి ఇరు దేశాల సేనలు రావడం అనుమానాలకు దారితీస్తోంది. కాగా, ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో రష్యా మద్దతు దళాలకూ,ఉక్రెయిన్‌ దళాలకూ మద్య 2014నుంచి జరుగుతున్న ఘర్షణల్లో 10వేల మందిపైగా మరణించారు.ఉక్రెయిన్‌లోని రష్యన్‌ పౌరుల ప్రాణాలనూ, ఆస్తులనూ కాపాడేందుకు తమ దేశం అవసరమైన మేరకు సేనలను పంపిస్తోందని పుతిన్‌ అంగీక రించారు.అయితే, ఇది దాడి కాదనీ, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.అయితే, రష్యా మద్దతుదారులకూ, ఉక్రెయిన్‌ దళాలకూ జరుగుతున్న పోరులో వేలాది గాయపడటాన్నీ, ఆస్తులు ధ్వసం కావడాన్ని కారణంగా చూపుతూ ఉక్రెయిన్‌ని ఆక్రమించుకోవడమే రష్యా లక్ష్యంగా కనిపిస్తోందని జి-7 దేశాలు ఆరోపించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement