Friday, November 22, 2024

నేటి సంపాదకీయం-విధి బలీయం..

ప్ర‌భ‌న్యూస్ : చీఫ్‌ ఆఫ్‌ డిపెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సం ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది,.ఆయన మరణంతో దేశం శత్రు భీకరుడైన గొప్ప యోధుణ్ణికోల్పోయిందన్న ప్రధాని, రాష్ట్రపతి వ్యాఖ్యల్లో అణు మాత్రం అత్యుక్తి లేదు. బుధవారం జరిగిన ఈ ఘటన భారత వాయుసేన చరిత్రలో అత్యంత విషాదకరమైనది.ఎంఐ-175 హెలికాప్టర్‌ అత్యంత ఉన్నతప్రమాణాలు కలి గినది.ప్రధాని,ఇతరప్రముఖులు స్వల్ప దూరం ప్రయాణాలకు దీనిని వినియోగిస్తుంటారు. ఈ హెలికాప్టర్‌ ఇంజన్‌లో కానీ, ఇతర భాగాల్లోకానీ ఎటువంటి లొసు గులు,సమస్యలులేవు. పైలట్‌ కూడా చాలా అనుభవం ఉన్నవాడే.అయినప్పటికీ ఈ దుర్ఘ టన చోటు చేసుకోవడం విధి బలీయమే అనుకోవాలి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదేశించారు.

ఈ ఘటనలో మరణించినవారిలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ సతీమణి మధూలిక, పలువురు సైనికాధికారులు, సహాయకులు ఉన్నారు. మొదట అందిన సమాచారం ప్రకారం రావత్‌ మినహా మిగిలిన అందరూ ప్రమాద స్థలిలోనే ప్రాణాలను కోల్పోగా రావత్‌కు 80 శాతం కాలిన గాయాలు అయినప్పటికీ, ఊపిరితోనే ఉన్నట్టు తెలియగానే ఆయనకు ముగ్గురు వైద్యుల బృందంఅత్యవసర చికిత్స అందించిన ప్పటికీ ఫలితం దక్కలేదు. జనరల్‌ రావత్‌ సైన్యంలో ఆర్మీ చీఫ్‌గా పదవిని నిర్వహించిన తర్వాత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ పదవిని రెండేళ్ళ క్రితం చేపట్టారు. త్రివిధ దళాల మధ్య సమ న్వయం కోసం మోడీ ప్రభు త్వం ఈ పదవిని సృష్టించింది.

దీనికి తొలినియామకంగా జన రల్‌ రావత్‌ను నియమించిం ది. జనరల్‌ రావత్‌కు అనేకయుద్ధాల్లో పాల్గొన్న ప్రావీణ్యం ఉంది. వాయుసేన పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను రెండేళ్ళ క్రితం బాలాకోట ప్రాంతంలో పాక్‌ సైన్యం నిర్బంధించిన ప్పుడు ఆయనను విడిపించేందుకు జనరల్‌ రావత్‌ ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆక్రమిత కాశ్మీర్‌పై దాడి చేసి ఆ ప్రాంతాన్ని విముక్తం చేస్తానం టూ ప్రకటించ డంతో ఆయన ధీరో దాత్తతను అందరూ ప్రశంసించారు.జనరల్‌ రావత్‌ పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలోనే కాకుండా లడఖ్‌లో చైనీస్‌ సేనల దాడియత్నాలను తిప్పికొట్ట డంలో ప్రముఖ పాత్ర వహించారు. అకుంఠిత దీక్ష కలిగిన సైనికాధికారి అని ప్రధాని, రాష్ట్రపతి, రక్షణ మంత్రి,పలువురు ప్రతిపక్షనాయకులు ప్రశంసించారు. ఆయన పరమవి శిష్ఠ సేవామెడల్‌, యుద్ధ సేవా మెడల్‌ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.అన్నింటినీ మించి సైన్యంలో వ్యూహరచనలో తన ప్రతిభను ఆయనపలుసార్లు చాటుకున్నారు. లడఖ్‌లో, మెక్‌మోహన్‌ రేఖ ప్రాంతాల్లో చైనా సైనికులు దూకుడు ప్రదర్శించినప్పుడు మన సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టింది.ఈ రెండు సంఘటనల్లో జనరల్‌ రావత్‌ పాత్రను ఇప్పటికీ ప్రశంసిస్తూ ఉంటారు.

జనరల్‌ రావత్‌ త్రివిధ దళాల మధ్య సమన్వయం చేకూర్చి సీడీఎస్‌ పదవిని సార్థకం చేశారు.ఆయన తీసుకున్న చర్యల కారణంగా ఈశాన్య ప్రాంతంలో తీవ్రవాదుల దాడులు,అలజడులు తగ్గాయి. యూరీ ప్రాంతం కమాండింగ్‌ అధికారిగా జమ్ముకాశ్మీర్‌లోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని అరికట్టడంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మనదేశంలో ప్రముఖులను బలిగొన్న హెలికాప్టర్‌ ప్రమాదాల్లో చాలా మటుకు వాతావ రణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే జరిగాయి.అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కర్నూలు జిల్లాలో పావురాల గుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలోమరణించారు. అంతకుముందు కేంద్ర మంత్రి మాధవరావు సింధియా, లోక్‌ సభ స్పీకర్‌ బాలయోగి, సంజయ్‌ గాంధీ, మాెెహన్‌కుమార మంగళం, తదితర ప్రముఖులు ఈ మాదిరి ప్రమాదాల్లో కన్నుమూశారు. మృతుల్లో రావత్‌ పర్శనల్‌ సెక్యూరిటీ అధికారి సాయితేజ కూడాఉన్నారు.

ఆయన చిత్తూరు జిల్లా వాసి.జనరల్‌ రావత్‌ యుద్ధ వ్యూహాలను తిప్పికొట్టడంలో నేర్పరి.కరోనాపై జరిగిన సదస్సులో మంగళవారం ప్రసంగిస్తూ భవిష్య త్‌లో బయోవార్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుందని అన్నారు.ఆయన ముందు చూపునకు ప్రభుత్వంలోని ప్రముఖులు ఎంతోప్రశంసించారుఈ ప్రమాదంలో మరణించిన రావత్‌ భార్య గొప్ప సమాజ సేవకురాలు.ఆర్మీ విడోల కోసం (భర్తలను కోల్పో యిన సైనికుల భార్యలకోసం) ఆమె ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement