Friday, November 22, 2024

నేటి సంప‌దకీయం – ‘గోప్యత’కు తిరుగులేదు!

ఇజ్రాయెల్‌ సాఫ్టవేర్‌ పెగాసెస్‌ని ప్రత్యర్దులపై ప్రయోగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను పురస్కరించుకుని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన మధ్యంతర తీర్పు దేశంలో ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు అద్దం పడుతోంది.దేశ ప్రజల ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యమో, గోప్యత అంత ముఖ్యమని ప్రధాన్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

ప్రజల హక్కులనూ, ప్రైవసీని పరిహరించడానికి ఎవరికీ అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు.పెగాసస్‌ పేరిట వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదనీ, అనుమానాలు తీర్చడానికి నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని జస్టిస్‌ రమణ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తమ వాదాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిం దంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రధానమంత్రి సహా ఎవరూ చట్టానికీ, రాజ్యాంగానికీ అతీతం కాదని ఆయన స్పష్టం చేస్తూ, తాము గత పార్లమెంటు సమా వేశాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశామనీ, దానిని సుప్రీంకోర్టు సమర్ధించిందని అన్నారు.

పెగాసస్‌ అనే మాల్వేర్‌ని ఉపయోగించి ప్రభుత్వం ప్రత్యర్ధుల, జర్నలిస్టులు,ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను జాతీయ ప్రయోజనాల కోసం ట్యాప్‌ చేయవచ్చునంటూ ప్రభుత్వం ఇచ్చిన వివరణ అన్ని సందర్భాల్లో సమర్ధ నీయం కాదని జస్టిస్‌ రమణ స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేసినందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డాయి. అప్పట్లోప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత బీజేపీ మాతృక అయిన భారతీయ జనసంఘ్‌ కూడా వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమర్జెన్సీ నాటి నల్ల చట్టాల కన్నా ఇది ఏమాత్రం తక్కువేమీ కాదని వాదించారు.

అయితే, పార్లమెంటులో తనకున్న బలాన్ని పురస్కరించుకుని ప్రతిపక్షాల అభ్యర్ధనను తిరస్కరించింది. ఇందుకు ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో కోర్టు సంతృప్తి చెందలేదు. జాతీయ భద్రత పేరిట ప్రజల హక్కులనూ, ముఖ్యంగా, గోప్యతా హక్కును హరించలేమని స్పష్టం చేసింది. మొదటి సారి పెగాసస్‌ దాడి గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు దీనిపై సమగ్రమైన ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి తగినంత సమయాన్ని ఇచ్చామనీ, కానీ, ప్రభుత్వం దాఖలు చేసిన అఫి డవిట్‌లో పసలేదని స్పష్టం చేసింది.అంకేకాకుండా విదేశీ సంస్థలు దేశ పౌరుల వ్యక్తిగత రహస్యల్లోకి తలదూర్చడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అయితే, గోప్యత పరిరక్షణ ముసుగులో వ్యక్తుల వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చే ధోరణి ఈ మధ్య ఎక్కువైంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు స్పష్టమైన ఆధా రాలున్నప్పటికీ, వాటిని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కానీ, బహిరంగంగా కానీ వెల్ల డించలేదు. పెగాసస్‌ మాల్వేర్‌ భారత్‌ లో తయారైంది కాకపోవడం వల్ల అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలు, వాటికి వివిధ సంస్థల నుంచి నిధుల గురించి తెలుసుకోవడానికి ఈ అధునాతన ప్రక్రియ అవసరమని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. దేశ రక్షణ,జాతీయ భద్రత మొదలైన అంశాల్లో ప్రభుత్వానికి సర్వోన్నత అధి కారాలు ఉన్న మాట నిజమే కానీ, పౌరుల ప్రాథమిక హక్కులకు హాని చేసే ఏ చర్యనైనా సమర్ధించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

- Advertisement -

రాజ్యాంగం పౌరు లకు ప్రసాదించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉందని స్పష్టం చేసింది.ఈ అంశంలో సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించేందుకు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీనిఏర్పాటు చేస్తు న్నట్టు ప్రధాన న్యాయముూర్తి ప్రకటించారు.గోప్యత ఉల్లంఘన జరిగిందా లేదా అనేది ఈ కమిటీ పరిశీలించి ఎనిమిది వారాలో నివేదిక సమర్పిస్తుంది.ఈ కమిటీ పనిని సర్వోన్నత న్యాయస్థానమే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వానికి ఇంతకుముందే తగినంత గడువు ఇచ్చినా, దేశ భద్రత రీత్యానో,మరే కారణం వల్లనో అఫిడవిట్‌లో అన్ని విషయాలు ప్రస్తావించకపో వడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement