Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – అసని అలజడి!

కోస్తా ప్రాంతానికి తుపానులు కొత్త కాదు. తుపానులో ఆస్తి నష్టాలు కూడాకొత్త కాదు. తపానులు ఎప్పుడూ గోరు చుట్టు మీద రోకలిపోటులే. ముందస్తు సమాచారంతో ప్రాణనష్టాన్ని ప్రభుత్వాలు అరికట్ట గలుగుతున్నాయి. మండుటెండల్లో,గుక్కెడు నీటికి కటకటలాడుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలకు అసని తుపాను కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.అదే సందర్భం లో ఆస్తి నష్టాన్ని కలిగించింది.ప్రతి సారీ తుపానుకు వాతావరణ శాఖ ఓ పేరు పెడుతూ ఉంటుంది.ఈ సారి తుపానుకు అసని అని పేరు పెట్టారు.ఈసారి తుపాను కదలిక అంచనాలకు అందకపోవడం వల్ల అధికార యంత్రాంగం ఇబ్బందులను ఎదుర్కొంది.ఈ సారి తుపాను ఒడిషాకు తీవ్రముప్పు అనీ, గోపాలపూర్‌ వద్ద తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, తుపాను దిశ మారిచివరికి ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపవచ్చని లెక్కగట్టారు.ఈసారి తుపాను ఐదు సార్లు దిశ మార్చుకోవడం వల్ల అంచనాలు తారుమారు అయ్యాయి. తుపానుల వల్ల తీర ప్రాంతాల్లో జనం గజగజ వణకడం సర్వసాధారణమే అయినా ఈసారి తరచు దిశలనుమార్చుకోవడం వల్ల ప్రజల్లో ధీమా లేకుండా పోయింది. ఎప్పుుడు తుపాను వచ్చినా పూరి గుడిసెలు,పెంకుటిళ్ళల్లో నివసించే పేద, మధ్యతరగతి వర్గాలే.గత తుపానులు కచ్చితంగా తమ ప్రాంతానికి దూసుకుని రావని ముందే తెలియడం వల్ల ప్రజలు ధైర్యంగా ఉండేవారు.అధికారులకు కూడా ఈసారి తుపాను చిక్కులను తెచ్చి పెట్టింది

.అయితే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయ నగరం జిల్లాలే కాకుండా ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడాతీర ప్రాం తాలు ఈ తుపానుకు విలవిలలాడాయి ఎన్‌డిఆర్‌ ఎఫ్‌ బృందాలు ఎప్పటి మాదిరిగా అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాయి. మత్స్యకారు లకు ముందుజాగ్తత్తగా హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పాడ- పిఠాపురం మధ్య సముద్రపు కోతకు రోడ్లు గురి కావడం ఈసారి కూడా తప్పలేదు. అంతర్వేది, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో ఐదు మీటర్ల ఎత్తులో అల్లలు దూసుకుని వచ్చినట్టు సమాచారం.ఈ తుపాను బంగాళా ఖాతంలో కల్లోలాన్ని సృష్టించింది. మత్స్యకారుల సము ద్రపు అలల్లో చిక్కుకున్న్టటు సమాచారమేదీ లేదు. అంతర్వేది వద్ద సముద్రపు అలల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు వరి, ఉద్యానవనం,మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరవై నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల మామిడి కాయ పూర్తిగా రాలిపోయి ఉంటుందని ఆందో ళన చెందుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా, విదేశాలకు విజయవాడ నుంచి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి.ఈసారి తుపాను ప్రభావం మామిడి ఎగుమతులపై పడవచ్చునని కలవర పడుతు న్నారు. అసలే ఈసారి మామిడి ఉత్పత్తి తక్కువగా ఉండటంతో టన్నుకు పదినుంచి 50 వేల వరకూ ధర పలుక గలదని రైతు ఆశించారు.అయితే,తుపాను వారి ఆశలపై నీరు జల్లినట్టయింది.

వరుసగా రెండేళ్ళుగా కరోనా వల్ల తీవ్ర నష్టాలకు గురి అయిన మామిడి రైతాంగం ఈసారి ఫలసాయంపై ఆశలు పెట్టుకున్నారు.అయితే,ఈ తుపా ను వల్ల వారిఆశలు ఆవిరిఅయ్యాయి. కోనసీమ ప్రాం తంలో అరటి తోటలు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని రహ దారులు కొట్టుకుని పోవడం వల్ల ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా కోస్తా జిల్లాలకే పరిమితం అయినా, రాయలసీమ,తెలంగాణ జిల్లాల్లో కూడాభారీ వర్షాల వల్ల కల్లాల్లో ధాన్యం నీటి పాలు అవుతున్నాయి.రాయలసీమలోఉద్యానవన పంటలకు వర్షాల వల్ల నష్టంచేకూరే ప్రమాదం ఉంది. అకాలవర్షాల వల్ల రాయలసీమ ఇప్పటికే బాగా దెబ్బతిని ఉంది.అన్ని ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యాలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రోడ్ల న్నీ గుంతలు, కోతలతో వాహన చోదకులు తీవ్ర మైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. విజయవాడ,రాజమహేంద్రవరం,తదితర ప్రాంతాల్లో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. బెంగ ళూరు, చెన్నై,హైదరాబాద్‌లకు ఇండిగో సంస్థ విమాన సర్వీసులను రద్దు చేసింది. అలాగే, దక్షిమ మధ్య రైల్వే కూడా పలు రైళ్ళను రద్దుచేసినట్టు సమాచారం. తుపాను ప్రభా వంతో రైలు పట్టాలపై నీరు నిలిచి పోవడం, రైళ్ళు రద్దు కావడం సర్వసాధారణమైపోయింది.తుపాను ప్రభా వం విశాఖపై ఎక్కువ ఉండటం వల్ల 22 పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement