ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటోరియల్…..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బుధవారంనాడు నందిగ్రామ్ అసెంబ్లిd స్థానానికి నామినేషన్ దాఖలు చేసి తిరుగు ప్రయాణానికి అధికారవాహనం ఎక్కినప్పుడు ఆమె కాలుకి గాయమైంది. నలుగురైదుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.అయితే,అది దాడి కాదనీ,కార్యకర్తలుతోసుకుంటూ రావడం వల్ల ఆమె కాలుకి గాయమైందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతకు వ్యతిరేకంగా ఆమె మాజీ కేబినెట్ సహచరుడు సువేందు అధికారి బీజేపీ అభ్యర్ధి గా పోటీ చేస్తున్నందున ఈ నియోజకవర్గంలో ఏ చిన్న గొడవ లేదా, సంఘటన చోటు చేసుకు న్నా, రాజకీయ ప్రకంపనలు ప్రారంభం అవుతున్నాయి. విఐపీలు పోటీ చేసే నియోజకవర్గా ల్లో ఇలాంటివి జరగడమూ సహజమే.వీటిపై రాజకీయ కథనాలు వ్యాపించడమూ సహజ మే.అయితే, బెంగాల్‌లోఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నాయకులు, మమత వర్గీయులు పరస్పరం చేసుకునే ఆరోపణలు దేశరాజకీయాల్లో సంచలనాన్ని సృష్టి స్తున్నాయి. తన వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్నసమయంలో ఒక గుంపు వచ్చి మీద పడిందనీ, దాంతో కాలికి గాయమైందని మమత గురువారంనాడు వివరించా రు. తనపై దాడి జరిగిందని బుధవారం చెప్పిన మమత మరునాడు ఈవిధంగా చెప్పడాన్ని బట్టి బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టివేయలేమని విశ్లేషకులు అంటు న్నారు. ఏమైనాఈ ఘటనకు రాజకీయ రంగు అంటుకోడం దురదృష్టకరం.మమతా బెనర్జీ కి నందిగ్రామ్‌లో శత్రువులుఎవరూ లేరు. మార్క్సిస్టు ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో నంది గ్రామ్‌లో భూములను ఇండోనేషియాకు చెందిన బహుళ జాతిసంస్థకు ధారాదత్తం చేసే ప్రయత్నాన్ని ఆనాటి ప్రతిపక్ష నాయకురాలిగా అడ్డుకున్నారు. ఆ నియోజకవర్గం తన సొంతం కాకపోయినప్పటికీ అక్కడి ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకంతోనే ఈసారి దాని ని ఎంచుకున్నారు. ఆమె నియోజకవర్గం మారడంపై ఇప్పటికే బీజేపీ ,తృణమూల్ కాంగ్రెస్ ల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలుూ,ఆరోపణలూ,ప్రత్యారోపణలూ చోటు చేసుకు న్నాయి. ఆమె స్థానికురాలు కాదని ఓసారి, ముస్లింల ఓట్లపై ఆధారపడి మార్చుకున్నారని మరోసారి కమలనాథులు ఆరోపించడంతో తాను హిందువునేనని చెప్పుకోవల్సి వచ్చింది. అంతేకాకుండా, పక్క నియోజకవర్గం నుంచే తాను వచ్చాననీ, రాష్టంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీచేసే హక్కు తనకుఉందని ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్‌కు చెందినవారైనా, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందలేదా అని ఆమె ప్రశ్నించారు. అయితే. ఈ వాదోపవాదాలు, గొడవలు ఆమెపై దాడికి ప్రేరేపించేం తటి తీవ్రమైనవి కావు. ఈ ఘటన యాదృచ్ఛికంగానే జరిగిఉండవచ్చు.ఆమెకూడా ఒక్క రోజులో స్వరంమార్చడాన్ని బట్టి దీనిపై రాజకీయంచేయకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తనకుకొంత కాలం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారనీ, త్వరలో నే వీల్ చైర్‌లో కూర్చుని ప్రచారాన్ని నిర్వహిస్తాననీ, కార్యకర్తలు అధౖౖెర్య పడొద్ద ని హితవొసు గుతూనే, ఆగ్రహానికి గురికావద్దని వి జ్ఞప్తి చేశారు. బెంగాల్ అసెంబ్లిd ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠా త్మకంగా తీసుకోవడం, మమతాబెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో ఆ పార్టీ నాయకులు విమర్శ లు చేస్తుండటంతో ఆమె కూడా అదే స్థాయిలో గళం విప్పుతున్నారు. అయితే, రాష్ట్ర పోలీసు డిజిపి మారిన మరునాడే ఈ సంఘటన జరగడాన్నిబట్టి పక్కా వ్యూహంతోనే ఈ దాడి జరిగిందని తృణమూల్ నాయకులు ఆరోపిస్తున్నారు. టికెట్లు పంపిణీలో ఈసారి తమకు అన్యాయం జరిగిందని కొందరు తృణమూల్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ పార్టీలో చేర్చుకు న్న కమలనాథులు మమతా బెనర్జీకి అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏ పార్టీకీ చెందని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఈఘటనపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది
మమత గాయంపై దుమారం……
Advertisement
తాజా వార్తలు
Advertisement